కాంగ్రెస్ పార్టీకి సునీతా లక్ష్మారెడ్డి గుడ్‌బై

అసెంబ్లీ ఎన్నికలతో మొదలైన కాంగ్రెస్ పార్టీ పతనం తెలంగాణలో కొనసాగుతూనే ఉంది. టీఆర్ఎస్ పార్టీ చేస్తోన్న ఆపరేషన్ ఆకర్ష్‌తో కాంగ్రెస్ పార్టీ కుదేలవుతోంది. ఇప్పటికే గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కారెక్కుతుంటే.. మరోవైపు సీనియర్ నేతలు కూడా గులాబీ దళంలో చేరిపోతున్నారు. తాజాగా.. మెదక్ జిల్లాకు పెద్దదిక్కు.. సీనియర్ నేత, మాజీ మంత్రి సునీతా లక్ష్మా రెడ్డి టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇవాళ కేటీఆర్‌తో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీలోకి కేటీఆర్ ఆహ్వానించగా… ఆమె సానుకూలంగా స్పందించారు. […]

Advertisement
Update:2019-03-26 06:56 IST

అసెంబ్లీ ఎన్నికలతో మొదలైన కాంగ్రెస్ పార్టీ పతనం తెలంగాణలో కొనసాగుతూనే ఉంది. టీఆర్ఎస్ పార్టీ చేస్తోన్న ఆపరేషన్ ఆకర్ష్‌తో కాంగ్రెస్ పార్టీ కుదేలవుతోంది. ఇప్పటికే గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కారెక్కుతుంటే.. మరోవైపు సీనియర్ నేతలు కూడా గులాబీ దళంలో చేరిపోతున్నారు.

తాజాగా.. మెదక్ జిల్లాకు పెద్దదిక్కు.. సీనియర్ నేత, మాజీ మంత్రి సునీతా లక్ష్మా రెడ్డి టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇవాళ కేటీఆర్‌తో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీలోకి కేటీఆర్ ఆహ్వానించగా… ఆమె సానుకూలంగా స్పందించారు. ఏప్రిల్ 3వ తేదీన ఆమె తన అనుచరులతో కలసి పార్టీలో చేరుతానని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం ఆమెకు సముచిత స్థానం కల్పిస్తామని కేసీఆర్ మాట ఇచ్చినట్లు సమాచారం.

తెలంగాణలోని నర్సాపూర్ నియోజకవర్గం నుంచి 2009లో ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో ఆమె మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో సునీత వర్గానికి పెద్ద ఎత్తున అనుచరులు ఉన్నారు. ఇప్పటికే సంగారెడ్డి జిల్లాకు చెందిన జగ్గారెడ్డి కేసీఆర్‌కు అనుకూలంగా ఉన్నారు. ఇక సీనియర్ నేత సునీత కారెక్కుతుండటంతో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయినట్లేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

Tags:    
Advertisement

Similar News