టీఆర్ఎస్‌కు షాక్.... ఎమ్మెల్సీ ఎన్నికల్లో యూటీఎఫ్ గెలుపు

తెలంగాణ రాష్ట్ర సమితికి తొలి సారిగా షాక్ తగిలింది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత మంచి ఊపుమీదున్న పార్టీకి ఉపాధ్యాయులు దెబ్బ కొట్టారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపరిచిన పీఆర్టీయూ అభ్యర్థి పూల రవీందర్ ఓటమి పాలయ్యారు. యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి రెండో ప్రాధాన్యత ఓట్లతో గెలుపొందారు. మొదటి ప్రాధాన్యత ఓట్లు 38 తగ్గడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించాల్సి వచ్చింది. ఆ తర్వాత నర్సిరెడ్డి గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. […]

Advertisement
Update:2019-03-26 11:30 IST

తెలంగాణ రాష్ట్ర సమితికి తొలి సారిగా షాక్ తగిలింది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత మంచి ఊపుమీదున్న పార్టీకి ఉపాధ్యాయులు దెబ్బ కొట్టారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపరిచిన పీఆర్టీయూ అభ్యర్థి పూల రవీందర్ ఓటమి పాలయ్యారు.

యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి రెండో ప్రాధాన్యత ఓట్లతో గెలుపొందారు. మొదటి ప్రాధాన్యత ఓట్లు 38 తగ్గడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించాల్సి వచ్చింది. ఆ తర్వాత నర్సిరెడ్డి గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. నర్సిరెడ్డికి 8,976, పూల రవీందర్‌కు 6,279 ఓట్లు పోలయ్యాయి.

ఇక ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పూల రవీందర్‌కు టీఆర్ఎస్ మద్దతు ప్రకటించగా.. నర్సిరెడ్డికి కాంగ్రెస్, వామపక్షాలు మద్దతుగా నిలిచాయి. నర్సిరెడ్డి గతంలో యూటీఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు.

Tags:    
Advertisement

Similar News