ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం.... ఏపీలో ఐపీఎస్‌ల బదిలీ

కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ ఇంటెలిజెన్స్ ఛీఫ్ ఏబీ వెంకటేశ్వరావు సహా కడప, శ్రీకాకుళం ఎస్పీలను బదిలీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఐబీ వెంకటేశ్వర రావుపై వైసీపీ అధినేత జగన్ ఎన్నికల కమిషన్‌కు పిర్యాదు చేశారు. తెలుగు దేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ…. వైసీపీ నాయకులపై కక్ష సాధింపు ధోరణి ప్రదర్శిస్తున్నారని ఆ పిర్యాదులో పేర్కొన్నారు. దీంతో వైసీపీ పిర్యాదుపై […]

Advertisement
Update:2019-03-26 16:28 IST

కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ ఇంటెలిజెన్స్ ఛీఫ్ ఏబీ వెంకటేశ్వరావు సహా కడప, శ్రీకాకుళం ఎస్పీలను బదిలీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

గతంలో ఐబీ వెంకటేశ్వర రావుపై వైసీపీ అధినేత జగన్ ఎన్నికల కమిషన్‌కు పిర్యాదు చేశారు. తెలుగు దేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ…. వైసీపీ నాయకులపై కక్ష సాధింపు ధోరణి ప్రదర్శిస్తున్నారని ఆ పిర్యాదులో పేర్కొన్నారు.

దీంతో వైసీపీ పిర్యాదుపై ఎన్నికల కమిషన్ స్పందించి…. ముగ్గురు ఐపీఎస్‌ల బదిలీకి ఆదేశాలు జారీ చేసింది.

ఈ ముగ్గురు అధికారులకు ఎన్నికల బాధ్యతలు అప్పగించవద్దని కూడా ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

Tags:    
Advertisement

Similar News