విధ్వంసానికి చంద్రబాబు ఆదేశం... సహనంతో ఉండండి- జగన్

కడప గడ్డపై పుట్టినందుకు గర్వంగా ఉందన్నారు వైఎస్ జగన్. పులివెందులలో పుట్టినందుకు మరింత గర్వంగా ఉందన్నారు  . పులివెందులలో జరిగిన బహిరంగసభలో ప్రసంగించిన జగన్‌… వందల నిందలు, వందల కుట్రలు చేస్తున్నా నిర్భయంగా ఉండేలా తనకు ధైర్యం ఇచ్చింది ఈ కడప గడ్డ అని అన్నారు. మంచి కోసం పనిచేస్తున్న సమయంలో కుళ్లుతో ఎదుటివారు కుట్రలు చేస్తున్నా చెదరకుండా నిలబడేతత్వాన్ని ఈ కడప గడ్డే తనకు నేర్పిందన్నారు. చీకటి తర్వాత వెలుగు వస్తుంది…. ధైర్యంగా నిలబడమని నేర్పింది… […]

Advertisement
Update:2019-03-22 06:51 IST

కడప గడ్డపై పుట్టినందుకు గర్వంగా ఉందన్నారు వైఎస్ జగన్. పులివెందులలో పుట్టినందుకు మరింత గర్వంగా ఉందన్నారు . పులివెందులలో జరిగిన బహిరంగసభలో ప్రసంగించిన జగన్‌… వందల నిందలు, వందల కుట్రలు చేస్తున్నా నిర్భయంగా ఉండేలా తనకు ధైర్యం ఇచ్చింది ఈ కడప గడ్డ అని అన్నారు.

మంచి కోసం పనిచేస్తున్న సమయంలో కుళ్లుతో ఎదుటివారు కుట్రలు చేస్తున్నా చెదరకుండా నిలబడేతత్వాన్ని ఈ కడప గడ్డే తనకు నేర్పిందన్నారు. చీకటి తర్వాత వెలుగు వస్తుంది…. ధైర్యంగా నిలబడమని నేర్పింది… ఈ గడ్డ అని జగన్‌ అన్నారు. పది మందికి సాయం చేయడం తమకు తెలుసన్నారు. మాట కోసం, మాట మీద నిలబడడం కోసం ఎంత కష్టమైనా భరించే సహనం ఉందన్నారు. అలాంటి ఈ కడప గడ్డపై పుట్టినందకు గర్వంగా ఉందన్నారు.

తన తండ్రి చనిపోయినా రాజకీయంగా ఒంటరైన సమయంలో తామున్నామని దగ్గరకు తీసుకున్న పులివెందుల, కడప జిల్లా ప్రజలకు ఎప్పటికీ రుణపడే ఉంటానన్నారు. తన చిన్నాన్న వివేకానందరెడ్డిని అతి దారుణంగా చంపించిన వారే తిరిగి బురదజల్లుతున్నారని జగన్ విమర్శించారు. కడప జిల్లాలో గెలుపు సాధ్యం కాదని తెలుసుకున్న చంద్రబాబు… ఇప్పుడు కుట్రలకు, అన్యాయాలకు తెగబడ్డారన్నారు. కడప జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీకి డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదన్నారు.

వైఎస్ వివేకానందరెడ్డిని చంపేస్తే జమ్మలమడుగులో ప్రచారం చేసే వారు కూడా ఉండరని కుట్ర చేశారన్నారు వైఎస్ జగన్‌. ”మరో మూడు రోజుల్లో విధ్వంసాలు, హత్యలు చేయండి… వాటిని వైసీపీ మీదకు నెట్టండి” అని చంద్రబాబు నిన్ననే ఆదేశాలు ఇచ్చినట్టు తమకు తెలిసిందన్నారు వైఎస్ జగన్‌. ఐదేళ్ల పాలన మీద ఎన్నికలు జరగకుండా మరో అంశంపై ఎన్నికలు జరిగేలా చేసేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారన్నారు.

చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా ప్రశాంతంగా ఉండాలని, సహనం కోల్పోవద్దని ప్రజలకు, కేడర్‌కు జగన్‌ సూచించారు. ఎన్నికల సమయానికి వైసీపీ నేతలను అరెస్ట్‌లు కూడా చేయవచ్చని.. అయినా సరే ప్రజలు, కార్యకర్తలే పార్టీ కోసం నిలబడాలని కోరారు. గ్రామాల్లో ఉన్న తన అక్కచెల్లెల్లు, అన్నదమ్ముళ్లే కడప జిల్లాలో వైసీపీ తరపున ఎన్నికలు నడిపించాలని జగన్‌ విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా వచ్చేది మాత్రం వైఎస్‌ఆర్‌ ప్రభుత్వమేనని జగన్‌ ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Similar News