మీ ఎముకల బలమెంత ?

నానాటికి మారుతున్న జీవనశైలికి వయసుతో సంబంధం లేకుండా ఆరోగ్య సమస్యలు వచ్చిపడుతున్నాయి.  శరీర నిర్మాణంలో ఎముకలు ప్రధానమైనవి. మానవ శరీరాకృతిని తీర్చిదిద్దేది ఎముకలే. కండరాలకు ఆధారం ఎముకలే. అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు అందరినీ ఎముకల సమస్య వేధిస్తునే ఉంది. దీనికి ప్రధాన కారణం శరీరంలో క్యాల్షియం లోపించడమే అంటున్నారు డాక్షర్లు.. శరీరం పటిష్ఠంగా ఉండాలంటే ఎముకలు గట్టిగా ఉండాలి. దీనికి క్యాల్షియం చాలా అవసరం. ఆహారంలో ఉన్న క్యాల్షియం నిల్వలు ఎముకలను గట్టి పరచడానికి తోడ్పడతాయి. […]

Advertisement
Update:2019-03-22 13:05 IST

నానాటికి మారుతున్న జీవనశైలికి వయసుతో సంబంధం లేకుండా ఆరోగ్య సమస్యలు వచ్చిపడుతున్నాయి. శరీర నిర్మాణంలో ఎముకలు ప్రధానమైనవి. మానవ శరీరాకృతిని తీర్చిదిద్దేది ఎముకలే. కండరాలకు ఆధారం ఎముకలే. అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు అందరినీ ఎముకల సమస్య వేధిస్తునే ఉంది. దీనికి ప్రధాన కారణం శరీరంలో క్యాల్షియం లోపించడమే అంటున్నారు డాక్షర్లు..

  • శరీరం పటిష్ఠంగా ఉండాలంటే ఎముకలు గట్టిగా ఉండాలి. దీనికి క్యాల్షియం చాలా అవసరం.
  • ఆహారంలో ఉన్న క్యాల్షియం నిల్వలు ఎముకలను గట్టి పరచడానికి తోడ్పడతాయి.
  • చిన్నతనం నుంచే ఎముకలకు కావాల్సిన క్యాల్షియం అందించాలి. లేదంటే వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకలు గుల్లబారి పోతాయి.

దీనికి తొలి పరిష్కారం క్యాల్షియం ఉన్న ఆహారం తీసుకోవడమే. ఏ ఆహారం తీసుకోవాలి.. ఎలాంటి నియమాలు పాటిస్తే క్యాల్షియం లభ్యమవుతుందో చూద్దాం.

  • ప్రతి ఒక్కరూ ఆహారం నియమాలు తప్పని సరిగా పాటించాలి. అల్పాహారం, భోజనం విషయంలో సమయపాలన పాటించాలి.
  • పాలలో అధిక మొత్తంలో క్యాల్షియం ఉంటుంది. రోజుకు రెండు లేక మూడు సార్లు తప్పకుండా పాలు తీసుకోవాలి.
  • కాఫీ, టీల జోలికి వెళ్లక పోవడం మంచిది.
  • మద్యపానం, ధూమపానం శరీరంలో ఉన్న క్యాల్షియాన్ని బయటకు పంపేందుకు దోహదపడతాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి.
  • ఎముకల సమస్యలు జన్యుపరంగా కూడా వస్తుంటాయి. తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఆస్టియోఫోరోసిస్‌ ఉంటే పిల్లలకు వంశపారంపర్యంగా సంక్రమించే అవకాశం ఉంటుంది.
  • వయస్సుతో పాటు ఎముకల సాంద్రత కూడా పెంచుకుంటాయి. సాధరణంగా 25-30 సంవత్సరాల మధ్యలో ఎముకల పునర్ నిర్మాణం జరుగుతుంది. ఈ సమయంలో శరీరానికి క్యాల్షియం చాలా అవసరం.

శరీరానికి క్యాల్షియం ఎలా అందుతుంది…

  • శరీరానికి ఎంత మేరకు క్యాల్షియం కావాలి… దానిని శరీరానికి ఎలా అందించాలి… ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. అనే విషయాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి.
  • బాదం, పిస్తా, నువ్వులు, పప్పులు ఎక్కువగా తినాలి. రాగులు, మొక్కజొన్న మొదలైన చిరుధాన్యాలలో క్యాల్షియం అధికంగా ఉంటుంది.
  • పెరుగు, జున్ను లాంటి పాల ఉత్పత్తులు ఎక్కువగా తీసుకుంటే మంచిది. చేప నూనెలో కూడా క్యాల్షియం లభిస్తుంది.
  • ఇక పళ్ల విషయానికి వస్తే సీతాఫలం, సపోటా లాంటి పండ్లలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. వీటిని తరచూ తీసుకుంటే ఎంతో మంచిది.

శరీరంలో క్యాల్షియం చేసే పనులు..

  • ఆహారంలో ఉన్న క్యాల్షియాన్ని ఎముకలు పీల్చుకుంటాయి.
  • రక్తంలో క్యాల్షియం నిల్వలు తక్కువగా ఉంటే … ఎముకల నుంచి తీసుకుంటుంది. అలాగే ఎముకలలో క్యాల్షియం తక్కువగా ఉంటే ఎముకలు రక్తం నుంచి తీసుకుంటాయి.
  • ఎప్పుడైతే రక్తంలోను, ఎముకలలోను క్యాల్షియం స్థాయిలు తగ్గుతాయో అప్పుడు ఎముకలు గుల్లబారి సమస్యలు ప్రారంభమవుతాయి.
  • ఆస్టియోఫోరోసిస్‌, ఎముకలు తేలికగా విరిగిపోవడం వంటి సమస్యలు మొదలవుతాయి.

ఎముకల సమస్యలను ఎంత త్వరగా గుర్తించి వాటికి పరిష్కారం చూపించగలిగితే అంత త్వరగా ఎముకలు పటిష్టంగా మారతాయి.

Tags:    
Advertisement

Similar News