మధుమేహం.... అప్రమత్తతే చికిత్స
మధుమేహం… షుగర్… డయాబెటీస్… పేర్లు ఏమైనా ఈ వ్యాధికి అప్రమత్తతే మందు. ఈ వ్యాధి నెమ్మది నెమ్మదిగా శరీరంలోకి చేరి నిండా ముంచేస్తుంది. భారతదేశంలో అత్యధిక మంది డయాబెటీస్ తో బాధపడుతున్నారు. ఈ షుగర్ వ్యాధి కనుక ఒక్కసారి వచ్చిందంటే ఇక జీవితాంతం మందులు వాడాల్సిందే. దీనికి చికిత్స కంటే కూడా అప్రమత్తతే చాలా ముఖ్యమని చెబుతున్నారు వైద్యనిపుణులు. ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలు, జాగ్రత్తలు ఏమిటో తెల్సుకుందాం.. శరీరంలో గ్లూకోజ్ స్దాయిని నిలువరించే క్లోమ గ్రంధి […]
మధుమేహం… షుగర్… డయాబెటీస్… పేర్లు ఏమైనా ఈ వ్యాధికి అప్రమత్తతే మందు. ఈ వ్యాధి నెమ్మది నెమ్మదిగా శరీరంలోకి చేరి నిండా ముంచేస్తుంది. భారతదేశంలో అత్యధిక మంది డయాబెటీస్ తో బాధపడుతున్నారు. ఈ షుగర్ వ్యాధి కనుక ఒక్కసారి వచ్చిందంటే ఇక జీవితాంతం మందులు వాడాల్సిందే. దీనికి చికిత్స కంటే కూడా అప్రమత్తతే చాలా ముఖ్యమని చెబుతున్నారు వైద్యనిపుణులు. ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలు, జాగ్రత్తలు ఏమిటో తెల్సుకుందాం..
- శరీరంలో గ్లూకోజ్ స్దాయిని నిలువరించే క్లోమ గ్రంధి (ప్యాంక్రియాటిస్) సరిపడా ఇన్సులిన్ ను సరఫరా చేయలేకపోవడమే ప్రధాన కారణం.
- దీని వల్ల శరీరంలో గ్లూకోజ్ స్దాయిలు పెరిగి షుగర్ వ్యాధికి దారితీస్తుంది.
- ఈ వ్యాధికి అప్రమత్తతే మందు తప్ప… దీనిని పూర్తిగా నయం చేసేందుకు మందులు మాత్రం లేవు.
- డయాబెటీస్ టైప్ 1, టైప్ 2, టైప్ 3 గా విభజించారు.
టైప్ 1: ఇది ఎక్కువగా చిన్నపిల్లలలో కనిపిస్తుంది. వారి శరీరంలో తగినంత ఇన్సూలిన్ తయారు కాకపోవడం వల్ల ఇది వస్తుంది.
టైప్ 2: నూటికి తొంభై శాతం మంది ఈ టైప్ 2 డయాబెటీస్ తో బాధపడుతుంటారు. శరీరంలో ఇన్సూలిన్ తయారైనప్పటికి, శరీరం దాన్ని వినియోగించుకునే శక్తిని కోల్పోతుంది.
టైప్ 3: ఇది గర్భిణులకు వస్తుంది. ప్రసవం ముందు షుగర్ వ్యాధి ఎటాక్ అయినప్పటికి, ప్రసవం తర్వాత తిరిగి గ్లూకోజ్ స్దాయిలు యథాస్థితికి వస్తాయి.
షుగర్ వ్యాధి లక్షణాలు
- డయాబెటీస్ వ్యాధి సోకిన వారికి చర్మంపై దురదలు పెట్టడం, అరికాళ్లు మంట, విపరీతంగా ఆకలి వేయడం, తరచు మూత్రానికి వెళ్లడం వంటి లక్షణాలు ప్రాధమికంగా కనిపిస్తాయంటున్నారు నిపుణులు.
- పొరపాటున శరీరంపై దెబ్బ తగిలితే అది ఓ పట్టాన తగ్గదు.
- సడన్ గా బరువు తగ్గడం కూడా వ్యాధి లక్షణంగా చెప్పవచ్చు.
ఈ వ్యాధిని ఎలా గుర్తించాలి…
- ఈ వ్యాధిని నిర్దారించడానికి రక్త నమూనాను పరీక్షించాలి.
- ఉదయమే ఎటువంటి ఆహారం కాని, కాఫీ, టీలు వంటివి తీసుకోకుండా రక్తం పరిక్ష చేయించుకోవాలి.
- ఈ రక్త పరిక్షలో గ్లూకోజ్ స్దాయి 126 కంటే ఎక్కువగా ఉండకూడదు.
- భోజనం చేసిన రెండు గంటల తర్వాత కూడా రక్త పరీక్ష చేయించుకుంటే, అందులో కూడా గ్లూకోజ్ స్దాయి 170 కంటే తక్కువగానే ఉండాలి.
- పై విధంగా రక్త నమూనాలు ఉంటే వారికి మధుమేహం లేదు అని చెప్పవచ్చు.
- రక్త నమూనాలో గ్లూకోజ్ స్దాయిని బట్టి వైద్యులు చికిత్స చేస్తారు.
- గ్లూకోజ్ స్దాయి చాలా ఎక్కువగా ఉంటే ఇన్సూలిన్ తీసుకోవాల్సి ఉంటుంది.
- రక్తంలో గ్లూకోజ్ తో పాటు కొలెస్ట్రాల్, టైగ్లిజరైడ్లు, హైబీపీ వంటి వాటిని కూడా పరీక్షించుకుని జాగ్రత్తలు తీసుకోవాలి.
మధుమేహాన్ని పూర్తిగా నిర్మూలించలేం కాబట్టి డాక్టర్లు చెప్పిన మందులు వాడుతూ… ఆహార నియమాలు పాటిస్తూ, వ్యాయమం చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.