కొందరు సినిమా స్టార్ల‌కు ఇవే చివ‌రి ఎన్నిక‌లా ?

ఏపీలో 2009లో ఓ ప్ర‌యోగం జ‌రిగింది. ప్ర‌జారాజ్యం పార్టీ ఫెయిల్ అయింది. ఇప్పుడు 2019లో జ‌న‌సేన పేరిట మ‌రో ప్ర‌యోగం జ‌రుగుతోంది. ఇప్ప‌టికే ఆ పార్టీపై ప్ర‌జ‌ల్లో ర‌కర‌కాల అనుమానాలు వ్యక్త‌మ‌వుతున్నాయి. ఎన్నిక‌ల త‌ర్వాత ఆ పార్టీ మ‌నుగ‌డ ఏంటి? అనేది ఓ బిగ్ కొశ్చ‌న్‌. ద‌క్షిణాదిలో కీల‌మైన మ‌రో రాష్ట్రం త‌మిళ‌నాడు. ఈ రాష్ట్రంలో క‌మ‌ల్‌హాస‌న్ మ‌క్క‌ల్ నీది మ‌య్యం పార్టీ పెట్టారు. ర‌జనీకాంత్ కూడా రాజకీయాల్లోకి వ‌చ్చారు. కానీ ఆయ‌న మాత్రం ఈ ఎన్నిక‌ల్లో […]

Advertisement
Update:2019-03-21 06:01 IST

ఏపీలో 2009లో ఓ ప్ర‌యోగం జ‌రిగింది. ప్ర‌జారాజ్యం పార్టీ ఫెయిల్ అయింది. ఇప్పుడు 2019లో జ‌న‌సేన పేరిట మ‌రో ప్ర‌యోగం జ‌రుగుతోంది. ఇప్ప‌టికే ఆ పార్టీపై ప్ర‌జ‌ల్లో ర‌కర‌కాల అనుమానాలు వ్యక్త‌మ‌వుతున్నాయి. ఎన్నిక‌ల త‌ర్వాత ఆ పార్టీ మ‌నుగ‌డ ఏంటి? అనేది ఓ బిగ్ కొశ్చ‌న్‌.

ద‌క్షిణాదిలో కీల‌మైన మ‌రో రాష్ట్రం త‌మిళ‌నాడు. ఈ రాష్ట్రంలో క‌మ‌ల్‌హాస‌న్ మ‌క్క‌ల్ నీది మ‌య్యం పార్టీ పెట్టారు. ర‌జనీకాంత్ కూడా రాజకీయాల్లోకి వ‌చ్చారు. కానీ ఆయ‌న మాత్రం ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం లేదు. 2009లో చిరంజీవి పార్టీ పెట్టిన‌ప్పుడు ఆ పార్టీలో ఎలా అయితే గొడ‌వ‌లు జ‌రిగాయో… ఆవిధంగా నే ఇప్పుడు క‌మ‌ల్ పార్టీలో ముసలం పుట్టింది.

సీనియర్ నటి కోవై సరళ పార్టీలో చేరినప్పటినుండి కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యంలో కుమ్ములాటలు మొదలయ్యాయి. కార్యనిర్వాహక కమిటీ సభ్యుడుగా ఉన్న కుమరవేలు హటాత్తుగా పార్టీకి రాజీనామా చేయటంతోపాటు కమల్ హాసన్, కోవై సరళపై విమర్శలు కురిపించటం మక్కల్ నీది మయ్యంలో కుమ్ములాటలకు కారణమైంది. ఆయ‌న‌తో పాటు మరో ముగ్గురు క్రియాశీలక సభ్యులు రాజీనామా చేయటంతో కమల్ పార్టీపై నీలినీడలు కమ్ముకున్నాయి.

క‌మ‌ల్ పార్టీ ఇప్ప‌టివ‌ర‌కూ 21 మందితో ఎంపీల జాబితా ప్ర‌క‌టించింది. కానీ ఆయ‌న మాత్రం ఇంకా ఎక్క‌డి నుంచి పోటీ చేస్తార‌నే విష‌యం ప్ర‌క‌టించ‌లేదు. అంతేకాకుండా కోవై స‌ర‌ళ కూడా పోటీ చేస్తార‌నే విష‌యం కూడా హాట్ టాపిక్‌గా మారింది. కమల్ హాసన్ ఒంటరి పోరు రానున్న ఎన్నికలలో మక్కల్ నీది మయ్యం భవిష్య‌త్‌ను తేల్చ‌బోతుంది.

క‌ర్నాట‌క‌లో ఉపేంద‌ర్ పార్టీ భ‌విష్య‌త్‌ను కూడా ఈ ఎన్నిక‌లు తేల్చ‌బోతున్నాయి. ఈ ఎన్నిక‌ల త‌ర్వాత సినీ తార‌లు ఇక రాజ‌కీయాల్లోకి వ‌స్తే జ‌నాలు ఆద‌రించేది? లేనిది తేల‌బోతోంది.

Tags:    
Advertisement

Similar News