అమెరికా చెస్ లో శరణార్థి బాలుడి సంచలనం

న్యూయార్క్ చెస్ విజేతగా 8 ఏళ్ల నైజీరియా సంతతి బాలుడు టానీ శరణార్థి శిబిరాలలోనే చదరంగంలో సాధన ప్రతిభావంతుల దేశం, వివిధ దేశాల నుంచి వలస వచ్చిన ప్రజల దేశం అమెరికాలో… నైజీరియా సంతతి బాలుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. నైజీరియాలోని ఉగ్రవాద సంస్థలకు బయపడి అమెరికాలోని శరణార్థి శిబిరంలో తలదాచుకొంటున్న టానీ అనే ఎనిమిదేళ్ల బాలుడు…. తనకుతానుగానే చెస్ క్రీడలో ఓనమాలు దిద్దుకొని..ఆ తర్వాత అరకొర శిక్షణ సదుపాయాల నడుమనే మెరికలాంటి ఆటగాడిగా మారాడు. శరణార్థి శిబిరంలోనే సాధన…. […]

Advertisement
Update:2019-03-20 14:30 IST
  • న్యూయార్క్ చెస్ విజేతగా 8 ఏళ్ల నైజీరియా సంతతి బాలుడు టానీ
  • శరణార్థి శిబిరాలలోనే చదరంగంలో సాధన

ప్రతిభావంతుల దేశం, వివిధ దేశాల నుంచి వలస వచ్చిన ప్రజల దేశం అమెరికాలో… నైజీరియా సంతతి బాలుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాడు.

నైజీరియాలోని ఉగ్రవాద సంస్థలకు బయపడి అమెరికాలోని శరణార్థి శిబిరంలో తలదాచుకొంటున్న టానీ అనే ఎనిమిదేళ్ల బాలుడు…. తనకుతానుగానే చెస్ క్రీడలో ఓనమాలు దిద్దుకొని..ఆ తర్వాత అరకొర శిక్షణ సదుపాయాల నడుమనే మెరికలాంటి ఆటగాడిగా మారాడు.

శరణార్థి శిబిరంలోనే సాధన….

ఇటీవలే జరిగిన న్యూయార్క్ చెస్ పోటీలలో…తనకంటే మెరుగైన శిక్షణ కలిగిన క్రీడాకారులను అలవోకగా ఓడించిన టానీ విజేతగా నిలిచాడు.

అంతర్జాతీయ చెస్ లో రాణించాలంటే అత్యాధునిక శిక్షణ, సదుపాయాలు అవసరం. అయితే.. .అపార అవకాశాలు ఉన్న అమెరికాలోని.. ఓ శరణార్థిగా తలదాచుకొంటున్న టానీకి ఎలాంటి హక్కులు, ఆదరణ లేకపోడంతో… అతని తల్లి, తండ్రి అదనంగా కష్టపడాల్సి వస్తోంది.

ఉచిత శిక్షణతోనే

వారానికి రెండుసార్లు నిర్వహించే ఉచిత శిక్షణ శిబిరాలలో పాల్గొంటూ… టానీ తన ఆటకు మెరుగులు దిద్దుకొంటున్నాడు. అతిపిన్న వయసులోనే గ్రాండ్ మాస్టర్ హోదా సాధించడమే లక్ష్యమని ఈ నైజీరియన్ బుడతడు చెబుతున్నాడు.

అభద్రతాభావం, ఆర్థిక సమస్యలు….

ఓ వైపు చెస్ పోటీల కోసం సాధన చేస్తున్న టానీని…ఎప్పటికైనా అమెరికా నుంచి తమ కుటుంబాన్ని వెనక్కి పంపుతారన్న భయం వెంటాడుతోంది.

ఎనిమిదేళ్ల చిరుప్రాయంలో కష్టాలు, అభద్రతాభావం, ఆర్థికసమస్యలు ఎదుర్కొంటున్న టానీ…ఏనాటికైనా ప్రపంచం గర్వించే చదరంగ ఆటగాడిగా ఎదగాలని కోరుకొందాం.

Tags:    
Advertisement

Similar News