ఉత్తమ్.. పార్లమెంటుకు పోటీ చెయ్యి..! రాహుల్ హుకుం..?

టీపీసీసీ అధ్యక్షుడు, హుజూర్‌ నగర్ ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమర్ రెడ్డికి ఇప్పుడు పెద్ద కష్టమొచ్చి పడింది. మొన్న తెలంగాణకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తను హుజూర్‌నగర్ నుంచి, భార్య పద్మావతి కోదాడ నుంచి పోటీ చేశారు. కేసీఆర్ హవా నడుమ తను, తన భార్య గెలవడానికి ఎంతో డబ్బు ఖర్చు పెట్టారు. చివరకు తాను మాత్రమే గెలవగా పద్మావతి మాత్రం ఓడిపోయింది. అయితే, ఇప్పుడు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తనను నల్గొండ పార్లమెంటు బరిలో నిలబడాలని నిర్ణయించడం […]

Advertisement
Update:2019-03-18 12:26 IST

టీపీసీసీ అధ్యక్షుడు, హుజూర్‌ నగర్ ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమర్ రెడ్డికి ఇప్పుడు పెద్ద కష్టమొచ్చి పడింది. మొన్న తెలంగాణకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తను హుజూర్‌నగర్ నుంచి, భార్య పద్మావతి కోదాడ నుంచి పోటీ చేశారు. కేసీఆర్ హవా నడుమ తను, తన భార్య గెలవడానికి ఎంతో డబ్బు ఖర్చు పెట్టారు. చివరకు తాను మాత్రమే గెలవగా పద్మావతి మాత్రం ఓడిపోయింది.

అయితే, ఇప్పుడు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తనను నల్గొండ పార్లమెంటు బరిలో నిలబడాలని నిర్ణయించడం ఉత్తమ్‌కు మింగుడు పడటం లేదు. పార్టీ ఎంత ఇచ్చినా పార్లమెంటు కోసం గతంలో కంటే మరింతగా ఖర్చు పెట్టాలి. ఈ నేపథ్యంలో ఏం చేయాలో పాలుపోని పరిస్థితులలో ఉన్నాడు ఉత్తమ్. నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకట రెడ్డిని గానీ, సీనియర్ నేత జానా రెడ్డిని గానీ బరిలోకి దించాలని ఆయన ప్రణాళిక రచించారు. ఆ మేరకు ఇప్పటికే అధిష్టానానికి ఒక లిస్టు కూడా పంపారు.

కాని రాహుల్ గాంధీ మరోలా ఆలోచించారు. తెలంగాణలో ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు టీఆర్ఎస్‌లోకి వలసబాట పట్టారు. అంతే కాకుండా ఇప్పుడు కేంద్రంలో రాహుల్ ప్రధాని కావాలంటే ఎంపీ సీట్లు కావాల్సిందే. ఈ నేపథ్యంలోనే గెలుపు గుర్రాలను బరిలో దించాలని రాహుల్ భావిస్తున్నారు. అందుకే ఇటీవల ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన పొన్నం ప్రభాకర్, రేవంత్ రెడ్డిలను ఎంపీ సీట్లలో నిలబెట్టారు.

చేవెళ్ల నుంచి విశ్వేశ్వర్ రెడ్డిని నిలబెట్టి సబిత మద్దతు లభిస్తుందని తొలుత భావించినా ఇప్పుడు ఇంద్రారెడ్డి కుటుంబం టీఆర్ఎస్‌లోకి వెళ్లిపోబోతోంది. దీంతో కనీసం 6 నుంచి 10 సీట్లు గెలిచే లక్ష్యంతో సీనియర్లకే సీట్లు ఇవ్వాలని అధిష్టానం భావిస్తోంది. అందుకే ఉత్తమ్‌ను నల్గొండ నుంచి పోటీ చేయమని ఒత్తిడి పెరుగుతోంది. మరి ఇందుకు ఉత్తమ్ ఏమంటారో వేచి చూడాల్సిందే.

Tags:    
Advertisement

Similar News