లోకేష్ పై.... తలసాని బీసీ గురి!
నారా లోకేష్. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి కుమారుడు. అంతే కాదు… తెలుగుదేశం పార్టీ సీనియర్లే వ్యాఖ్యానిస్తున్నట్లుగా దొడ్డిదారిన మంత్రి అయిన యువ కిశోరం. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న శాసనసభ ఎన్నికల్లో ఆ నియోజకవర్గం… ఈ నియోజకవర్గం అంటూ పిల్లి పిల్లల్ని తిప్పినట్లుగా తిరిగి తిరిగి… మంగళగిరి నుంచి పోటీకి సిద్ధపడ్డ కుమార రత్నం… మంగళగిరిలో బీసీల ఓట్లు… ముఖ్యంగా పద్మశాలీల ఓట్లు అధికంగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి బీసీలు ఆయువు పట్టు అని […]
నారా లోకేష్. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి కుమారుడు. అంతే కాదు… తెలుగుదేశం పార్టీ సీనియర్లే వ్యాఖ్యానిస్తున్నట్లుగా దొడ్డిదారిన మంత్రి అయిన యువ కిశోరం.
ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న శాసనసభ ఎన్నికల్లో ఆ నియోజకవర్గం… ఈ నియోజకవర్గం అంటూ పిల్లి పిల్లల్ని తిప్పినట్లుగా తిరిగి తిరిగి… మంగళగిరి నుంచి పోటీకి సిద్ధపడ్డ కుమార రత్నం… మంగళగిరిలో బీసీల ఓట్లు… ముఖ్యంగా పద్మశాలీల ఓట్లు అధికంగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి బీసీలు ఆయువు పట్టు అని చెబుతున్న చంద్రబాబు నాయుడు ఈ నియోజకవర్గం నుంచి టిక్కెట్ ఆశిస్తున్న వారిని కాదని తన కుమారుడ్ని రంగంలోకి దింపారు.
అయితే, ఆయనకు ఆదిలోనే ఇక్కడ ఎదురుదెబ్బ తగిలింది. పార్టీలో టిక్కెట్ ఆశిస్తున్న పద్మశాలీ వర్గానికి చెందిన కాండ్రు కమల తమను కలిసేందుకు వచ్చిన లోకేష్ ను అందరి ముందు కడిగిపారేశారు. “ఇప్పుడే ఏమీ చేయలేదు. అధికారంలోకి వచ్చాక ఏం చేస్తారు ” అంటూ నిలదీసారు. దీనిపై లోకేషూ కాస్త కంగారు పడి…. నీళ్లు నమిలినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
తమకు టిక్కట్ ఇవ్వకపోవడంపై పద్మశాలీలు మంగళగిరిలో బంద్ కూడా పాటించారు. అయితే మరోవైపు లోకేష్ ను ఎలాగైనా ఓడించేందుకు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ భారీ స్ధాయిలో పావులు కదుపుతున్నట్లు సమాచారం. బీసీల ఓట్లు ఎక్కువగా ఉన్న మంగళగిరిలో తనకు అత్యంత సన్నిహితులైన వారిని రంగంలోకి దింపేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
తెలంగాణలో సిరిసిల్లకు చెందిన పద్మశాలీలను కూడా రంగంలో దింపేందుకు ప్రయత్నాలు ప్రారంభించారంటున్నారు. తాను సనత్ నగర్ నుంచి పోటీ చేసిన సమయంలో తన ఓటమి కోసం లోకేష్ శతవిధాలా ప్రయత్నించారని, ఇప్పుడు తనకు అవకాశం వచ్చిందని తలసాని శ్రీనివాసయాదవ్ తన సన్నిహితుల వద్ద అన్నట్లు చెబుతున్నారు.
లోకేష్ ఓటమి కోసం హైదరాబాద్ నుంచే వ్యూహ రచన చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే బీసీలు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారనే వార్తలు వస్తున్ననేపథ్యంలో మంగళగిరిలో బీసీలను ఏకం చేసి లోకేష్ ఓటమికి శాయశక్తులా కష్టపడాలని తలసాని నిర్ణయించినట్లు చెబుతున్నారు.