హైటెక్ సిటీ మెట్రో.... ప్రారంభం ఎప్పుడో తెలుసా?

హైదరాబాద్ నగరంలో అత్యంత రద్దీగా ఉండే రహదారుల్లో ఒకటి అమీర్‌పేట – హైటెక్ సిటీ. మాధాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గం ప్రాంతాల్లో అత్యధికంగా సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఉండటంతో ఉదయం, సాయంకాలం వేళల్లో ఈ రోడ్లలో వెళ్లాలంటే ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని ఛేదించాల్సిందే. ఈ నేపథ్యంలోనే నాగోల్ – రాయదుర్గం మార్గాన్ని తొలి దశలోనే ప్రతిపాదించి నిర్మాణం ప్రారంభించారు. నాగోల్ నుంచి అమీర్‌పేట వరకు ఉన్న మార్గం ప్రారంభమై ఏడాదిన్నర గడిచింది. మరోవైపు ఎల్‌బీనగర్ – మియాపూర్ మార్గం కూడా […]

Advertisement
Update:2019-03-18 14:10 IST

హైదరాబాద్ నగరంలో అత్యంత రద్దీగా ఉండే రహదారుల్లో ఒకటి అమీర్‌పేట – హైటెక్ సిటీ. మాధాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గం ప్రాంతాల్లో అత్యధికంగా సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఉండటంతో ఉదయం, సాయంకాలం వేళల్లో ఈ రోడ్లలో వెళ్లాలంటే ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని ఛేదించాల్సిందే. ఈ నేపథ్యంలోనే నాగోల్ – రాయదుర్గం మార్గాన్ని తొలి దశలోనే ప్రతిపాదించి నిర్మాణం ప్రారంభించారు.

నాగోల్ నుంచి అమీర్‌పేట వరకు ఉన్న మార్గం ప్రారంభమై ఏడాదిన్నర గడిచింది. మరోవైపు ఎల్‌బీనగర్ – మియాపూర్ మార్గం కూడా ప్రారంభమైంది. దీంతో హైటెక్‌సిటీ మార్గం ఎప్పుడు ప్రారంభమవుతుందా అని నగరవాసులు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మార్గం ఎప్పుడు ప్రారంభిస్తారో అనే విషయంపై మెట్రో అధికారులు శుభవార్త చెప్పారు.

ఇప్పటికే అన్ని రకాల పరీక్షలు పూర్తి చేసుకున్న హైటెక్ సిటీ మార్గం ఈ నెల 20న అంటే మరో మూడు రోజుల్లో ప్రారంభించడానికి మెట్రో అధికారులు ముహూర్తం నిర్ణయించారు. ఈ మార్గం ప్రారంభమైతే అమీర్‌పేట నుంచి హైటెక్‌సిటీకి కేవలం 20 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ఈ మార్గంలో అమీర్‌పేట తర్వాత మధురానగర్, యూసుఫ్‌గూడ, జూబ్లీ హిల్స్, రోడ్ నెంబర్ 5, జూబ్లీ చెక్ పోస్ట్, పెద్దమ్మగుడి, మాధాపూర్, దుర్గం చెర్వు, హైటెక్ సిటీ స్టేషన్లు ఉన్నాయి.

ఈ మార్గం ప్రారంభంతో రెండు కారిడార్లు పూర్తయినట్లే.. ఇక మిగిలింది జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మార్గం మాత్రమే.

Tags:    
Advertisement

Similar News