రైల్వే ట్రాక్ పై ప‌బ్ జీ గేమ్.... ప్రాణం పోగొట్టుకున్న యువ‌కులు

పబ్ జీ (ప్లేయర్ అన్ నోన్స్ బ్యాటిల్ గ్రౌండ్స్) గేమ్ ఆడుతూ యువ‌కులు త‌మ ప్రాణాల్ని ఫ‌ణంగా పెడుతున్నారు. గేమ్ కంప్లీట్ చేయాల‌ని ప్ర‌మాదక‌ర‌మైన ప్రాంతాల్లో ఒక‌రికొక‌రు పోటీప‌డుతున్నారు. వారిలో కొంత‌మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అయితే ఈ గేమ్ ను ఆడేవాళ్ల‌ను అరెస్ట్ చేయాల‌ని గుజ‌రాత్ రాష్ట్రంలో రాజ్ కోట్ న‌గ‌ర పోలీస్ క‌మీష‌నర్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఆ ఆదేశాల‌తో మంచి ఫ‌లితాలు రావ‌డంతో దేశ వ్యాప్తంగా ఈ నిబంధ‌న‌ల్ని అమ‌లు చేసేందుకు కేంద్రం స‌మాయత్త‌మైంది. […]

Advertisement
Update:2019-03-18 07:42 IST

పబ్ జీ (ప్లేయర్ అన్ నోన్స్ బ్యాటిల్ గ్రౌండ్స్) గేమ్ ఆడుతూ యువ‌కులు త‌మ ప్రాణాల్ని ఫ‌ణంగా పెడుతున్నారు. గేమ్ కంప్లీట్ చేయాల‌ని ప్ర‌మాదక‌ర‌మైన ప్రాంతాల్లో ఒక‌రికొక‌రు పోటీప‌డుతున్నారు. వారిలో కొంత‌మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.

అయితే ఈ గేమ్ ను ఆడేవాళ్ల‌ను అరెస్ట్ చేయాల‌ని గుజ‌రాత్ రాష్ట్రంలో రాజ్ కోట్ న‌గ‌ర పోలీస్ క‌మీష‌నర్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఆ ఆదేశాల‌తో మంచి ఫ‌లితాలు రావ‌డంతో దేశ వ్యాప్తంగా ఈ నిబంధ‌న‌ల్ని అమ‌లు చేసేందుకు కేంద్రం స‌మాయత్త‌మైంది.

ఈ నేప‌థ్యంలో మ‌హరాష్ట్ర‌లోని హింగోళి ప్రాంతంలో ప‌బ్ జీ గేమ్ ఆడుతూ ఇద్ద‌రు యువ‌కులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. నగేశ్ గోరె (24), స్వప్నీల్ అన్నపూర్ణే (22) టాస్క్ లు కంప్లీట్ చేయాల‌నే ఉద్దేశంతో నిర్మానుష్యంగా ఉన్న హింగోళీ ప్రాంతానికి వెళ్లి గేమ్ ఆడ‌డం మొద‌లుపెట్టారు. కొంత స‌మ‌యం త‌రువాత ఖట్కాలీ బైపాస్ దగ్గర రైల్వే ట్రాక్‌ల‌ పైకి చేరుకున్నారు. గేమ్ ఆడుతూనే ట్రాక్ ల‌పై అలాగే ఉండిపోయారు. చేతిలో ఫోన్లు… చుట్టుప‌క్క‌ల ప్రపంచంలో ఏం జ‌రుగుతుందో తెలియ‌లేనంత‌గా ఆట‌లో నిమ‌గ్న‌మ‌య్యారు.

అయితే స‌డ‌న్ గా హైదరాబాద్ నుంచి అజ్మీర్ వెళ్తున్న రైలు అటుగా వ‌చ్చింది. ప‌బ్ జీ గేమ్ లో మునిగితేలడంతో ట్రైన్ శ‌బ్దాలుగాని, వారిద్ద‌రు రైల్వే ప‌ట్టాల‌పై ఉన్న‌ విష‌యం కూడా మ‌రిచిపోయి ఆడుతూనే ఉన్నారు. అంత‌లోనే అటుగా వ‌చ్చిన ట్రైన్ న‌గేశ్, స్వ‌ప్నీల్ లను ఢీకొట్ట‌డంతో దేహాలు చెల్లా చెదుర‌య్యాయి. స్థానికుల స‌మాచారంతో ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు ఈ ప్ర‌మాదం ఎలా జ‌రిగింది అనే కోణంలో విచారణ చేప‌ట్ట‌గా…. ప‌బ్ జీ గేమ్ ఆడ‌డం వ‌ల్లే ప్రాణాలు పోయాయ‌ని నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.

Tags:    
Advertisement

Similar News