పీఆర్పీ గెలిచిన సీట్లను పెండింగ్‌లో పెట్టిన బాబు
విశాఖ జిల్లాలో సీట్ల వ్యవహారం ఆసక్తికరంగా ఉంది. గతంలో పీఆర్పీ గెలిచిన సీట్లలో చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించక పోవడం చర్చనీయాంశమైంది. ఈ సీట్లలో జనసేనకు సహకరించేందుకు చంద్రబాబు పెండింగ్‌లో పెట్టారని భావిస్తున్నారు. భీమిలి, గాజువాక, పెందుర్తి నియోజక వర్గాల్లో టీడీపీ అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించలేదు. భీమిలి, గాజువాక, పెందుర్తి నియోజకవర్గాల నుంచి గతంలో పీఆర్పీ విజయం సాధించింది. ఈసారి పవన్ కల్యాణ్ గాజువాక నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అందుకే గాజువాక అభ్యర్థి ప్రకటన విషయంలో చంద్రబాబు ఆచితూచి స్పందిస్తున్నట్టు భావిస్తున్నారు. భీమిలి నుంచి […]
విశాఖ జిల్లాలో సీట్ల వ్యవహారం ఆసక్తికరంగా ఉంది. గతంలో పీఆర్పీ గెలిచిన సీట్లలో చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించక పోవడం చర్చనీయాంశమైంది. ఈ సీట్లలో జనసేనకు సహకరించేందుకు చంద్రబాబు పెండింగ్‌లో పెట్టారని
భావిస్తున్నారు.
భీమిలి, గాజువాక, పెందుర్తి నియోజక వర్గాల్లో టీడీపీ అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించలేదు. భీమిలి, గాజువాక, పెందుర్తి
నియోజకవర్గాల నుంచి గతంలో పీఆర్పీ విజయం సాధించింది. ఈసారి పవన్ కల్యాణ్ గాజువాక నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అందుకే గాజువాక అభ్యర్థి ప్రకటన విషయంలో చంద్రబాబు ఆచితూచి స్పందిస్తున్నట్టు భావిస్తున్నారు.
భీమిలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గంటాను విశాఖ నార్త్‌కు మార్చేశారు. ఈ సీటు నుంచి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. నేరుగా టీడీపీలో చేరి పోటీ చేయాలనుకున్న లక్ష్మీనారాయణ ఇప్పుడు జనసేన నుంచి పోటీ చేస్తారని చెబుతున్నారు.
నిన్న పవన్ కల్యాణ్‌ను లక్ష్మీనారాయణ కలవడం కూడా ఇందుకు బలాన్నిస్తోంది. పెందుర్తి సీటును కూడా చంద్రబాబు పెండింగ్ లో పెట్టారు. జనసేనకు, జేడీ లక్ష్మీనారాయణకు సహకరించేందుకే చంద్రబాబు ఈ సీట్లలో అభ్యర్థులను ప్రకటించలేదని టీడీపీ నేతలే భావిస్తున్నారు.