కొత్త సమస్యలు కొంపముంచుతాయా? బాబును వెంటాడుతున్న భయం

ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ చంద్రబాబునాయుడిలో ఆందోళన పెరుగుతోంది. రోజుకో కొత్త సమస్యలు వచ్చి చంద్రబాబు నాయుడు సతమతమవుతున్నారని పార్టీ సీనియర్ నాయకులు చెబుతున్నారు. నిన్నటి వరకు అభ్యర్థుల ఎంపిక ఒక తలపోటుగా మారితే… తాజాగా ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కూడా చంద్రబాబు నాయుడుకు నిద్రపట్టనివ్వడం లేదని చెబుతున్నారు. ఈ హత్య ఎవరు చేశారు? ఎలా జరిగింది? అనే అంశాలను పక్కన […]

Advertisement
Update:2019-03-16 05:33 IST

ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ చంద్రబాబునాయుడిలో ఆందోళన పెరుగుతోంది. రోజుకో కొత్త సమస్యలు వచ్చి చంద్రబాబు నాయుడు సతమతమవుతున్నారని పార్టీ సీనియర్ నాయకులు చెబుతున్నారు. నిన్నటి వరకు అభ్యర్థుల ఎంపిక ఒక తలపోటుగా మారితే… తాజాగా ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కూడా చంద్రబాబు నాయుడుకు నిద్రపట్టనివ్వడం లేదని చెబుతున్నారు.

ఈ హత్య ఎవరు చేశారు? ఎలా జరిగింది? అనే అంశాలను పక్కన పెడితే ప్రజల దృష్టి మాత్రం ఎన్నికల నుంచి హత్యా రాజకీయాల వైపు మళ్ళిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ సీనియర్ల వద్ద వాపోయినట్లు చెబుతున్నారు.

సిట్ దర్యాప్తుకు ఆదేశించినా… హత్యపై ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఖండించినా ఎన్నికల ముందు ఇలా జరగడం పార్టీకి తీవ్ర నష్టం చేస్తుందని చంద్రబాబు నాయుడు ఆందోళన చెందుతున్నట్లు చెబుతున్నారు.

వివేకానంద రెడ్డి హత్య పై ప్రజల్లో సానుభూతి పెరుగుతుందని, హత్య జరిగిన సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు గానీ, కుటుంబ సభ్యులు కాని హత్యా స్థలంలో లేకపోవడం వారికి కలిసివచ్చే అంశమని చంద్రబాబు నాయుడు అన్నట్టు సమాచారం.

సౌమ్యుడిగా పేరున్న వివేకానందరెడ్డిని ఎందుకు హత్య చేశారో తెలియక పోయినా దాని ప్రభావం మాత్రం రానున్న ఎన్నికల్లో తీవ్రంగా ఉంటుందని చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులతో అన్నట్లు చెబుతున్నారు. ఈ తరుణంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏకతాటిపై ఉండి ఎన్నికల్లో విజయం సాధించేందుకు కష్టపడాలని చంద్రబాబు హితవు పలికినట్లు సమాచారం.

వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి ఎవరూ ఎక్కడా ఎలాంటి ప్రకటనలు చేయవద్దని, ఇలాంటి ప్రకటనల గందరగోళాన్ని కూడా ప్రధాన ప్రతిపక్షం వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మార్చుకుంటుందని చంద్రబాబు నాయుడు అన్నట్లు సమాచారం.

Tags:    
Advertisement

Similar News