న్యూజిలాండ్ లో కాల్పుల కలకలం

గండం గడచిన బంగ్లాదేశ్ క్రికెటర్లు రెండు మసీదుల్లో దుండగుల కాల్పులు 40 మంది మృతి, 30 మందికి గాయాలు? ప్రశాంతతకు మరో పేరైన న్యూజిలాండ్ లోని క్రైస్ట్ చర్చి నగరంలో కాల్పుల సంఘటన ప్రపంచాన్ని ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసింది. క్రైస్ట్ చర్చి నగరంలోని అల్ నూర్ మసీద్, లిన్ వుడ్ మసీద్ లో… ప్రార్ధనలు జరుగుతున్న సమయంలో సాయుధ దుండగులు చొరబడి కాల్పులకు తెగబడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కాల్పులకు తానే కారణమంటూ ఆస్ట్రేలియా జాతీయుడు బ్రెంటన్ టారెంట్ సోషల్ […]

Advertisement
Update:2019-03-15 07:13 IST
  • గండం గడచిన బంగ్లాదేశ్ క్రికెటర్లు
  • రెండు మసీదుల్లో దుండగుల కాల్పులు
  • 40 మంది మృతి, 30 మందికి గాయాలు?

ప్రశాంతతకు మరో పేరైన న్యూజిలాండ్ లోని క్రైస్ట్ చర్చి నగరంలో కాల్పుల సంఘటన ప్రపంచాన్ని ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసింది. క్రైస్ట్ చర్చి నగరంలోని అల్ నూర్ మసీద్, లిన్ వుడ్ మసీద్ లో… ప్రార్ధనలు జరుగుతున్న సమయంలో సాయుధ దుండగులు చొరబడి కాల్పులకు తెగబడినట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ కాల్పులకు తానే కారణమంటూ ఆస్ట్రేలియా జాతీయుడు బ్రెంటన్ టారెంట్ సోషల్ మీడియా ద్వారా తనకుతానుగా ప్రకటించుకొన్నాడు. కాల్పుల మోతతో కొద్ది గంటలపాటు దద్దరిల్లిన ఈ సంఘటనలో 40 మంది మృతి చెందినట్లు, మరో 30 మంది తీవ్రంగా గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు న్యూజిలాండ్ పోలీసులు ప్రకటించారు.

బంగ్లాదేశ్ క్రికెటర్ల గ్రేట్ ఎస్కేప్….

క్రైస్ట్ చర్చి వేదికగా న్యూజిలాండ్ తో మూడో టెస్ట్ మ్యాచ్ ఆడటానికి సిద్ధమవుతున్న బంగ్లాదేశ్ క్రికెటర్లు…గ్రౌండ్ నుంచి హోటల్ రూమ్ లకు చేరుకోడం ద్వారా గండం నుంచి బయటపడ్డారు. రెండు దేశాల క్రికెట్ బోర్డులు చర్చించుకొని…మూడు మ్యాచ్ ల సిరీస్ లోని ఆఖరి టెస్ట్ మ్యాచ్ ను రద్దు చేసుకోవాలని నిర్ణయించాయి.

బంగ్లా క్రికెటర్లు మసీదుకు వెళ్లి ప్రార్థనలు జరుపుకొని తిరిగి వచ్చిన సమయంలోనే కాల్పుల సంఘటన చోటు చోసుకొంది. న్యూజిలాండ్ లోని రెండు వేర్వేరు మసీదుల్లో కాల్పుల ఘటన జరగటం… పెను సంచలనంగా మారింది.

Tags:    
Advertisement

Similar News