శ్రీశాంత్ పై వీడిన జీవితకాల నిషేధం
నిషేధం ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు బీసీసీఐ నిర్ణయాన్ని కొట్టేసిన సుప్రీం కోర్టు నిషేధం తొలగించి శిక్ష వేయాలంటూ ఆదేశం టీమిండియా కమ్ ఐపీఎల్ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ పై…స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో పడిన జీవితకాల నిషేధాన్ని తొలగించినట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. శ్రీశాంత్, అజిత్ చండీలా, కేదార్ చవాన్ లు .. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆడుతూ స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడ్డారని…బుకీలతో సంబంధాలున్నాయంటూ ఆరోపణలు రావడం, బీసీసీఐ విచారణ అనంతరం ఈ ముగ్గురిపైనా జీవితకాల నిషేధం విధించడం తెలిసిందే. అయితే […]
- నిషేధం ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు
- బీసీసీఐ నిర్ణయాన్ని కొట్టేసిన సుప్రీం కోర్టు
- నిషేధం తొలగించి శిక్ష వేయాలంటూ ఆదేశం
టీమిండియా కమ్ ఐపీఎల్ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ పై…స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో పడిన జీవితకాల నిషేధాన్ని తొలగించినట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది.
శ్రీశాంత్, అజిత్ చండీలా, కేదార్ చవాన్ లు .. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆడుతూ స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడ్డారని…బుకీలతో సంబంధాలున్నాయంటూ ఆరోపణలు రావడం, బీసీసీఐ విచారణ అనంతరం ఈ ముగ్గురిపైనా జీవితకాల నిషేధం విధించడం తెలిసిందే.
అయితే …తాను ఏపాపం ఎరుగనని, తాను ఏ తప్పు చేయలేదని… క్రికెట్టే తనకు జీవనాధారమంటూ శ్రీశాంత్ సుప్రీంను ఆశ్రయించాడు.
అజార్, అజయ్ జడేజా లాంటి కొందరు క్రికెటర్లపై నిషేధం ఎత్తివేసిన బీసీసీఐ తమ పైన విధించిన నిషేధాన్ని ఎందుకు ఎత్తి వేయదంటూ సుప్రీంను శ్రీశాంత్ ఆశ్రయించాడు.
శ్రీశాంత్ పై విధించిన నిషేధాన్ని తక్షణమే తొలగిస్తున్నట్లు సుప్రీం కోర్టు ప్రకటించింది. అయితే… శ్రీశాంత్ చేసిన తప్పుకు తగిన శిక్షను విధించాలని… ఈ నిర్ణయాన్ని మూడుమాసాలలోపు అమలు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
మొత్తం మీద…తనతో పాటు మరో ఇద్దరు క్రికెటర్లపైన పడిన జీవితకాల నిషేధం సుదీర్ఘ పోరాటం తర్వాత వీడడంతో శ్రీశాంత్ ఊపిరిపీల్చుకొన్నాడు. తిరిగి తాను క్రికెట్ గ్రౌండ్ లో సత్తా చాటుకొంటానని ధీమాగా చెబుతున్నాడు.