లోకేష్‌ను ఓడించేందుకు కూడా సిద్ధం....

చంద్రబాబు పద్దతికి, జగన్‌ పద్దతికి చాలా తేడా ఉందని… జగన్‌ వస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుందనే తాను వైసీపీలో చేరినట్టు జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాస్‌ చెప్పారు. టీడీపీతో తనకు ఎలాంటి సంబంధాలు లేవన్నారు. గతంలో ఒకసారి టీడీపీ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించినా చంద్రబాబు అవకాశం ఇవ్వలేదన్నారు. ఈ ఐదేళ్ల పాలన చూసిన తర్వాత చంద్రబాబు వల్ల ఎలాంటి ఉపయోగం రాష్ట్రానికి లేదని తాను ఒక నిర్ధారణకు వచ్చానన్నారు.  హైదరాబాద్‌ను చంద్రబాబు ఒక్కరే కాదని… మిగిలిన ముఖ్యమంత్రులంతా పనిచేస్తేనే హైదరాబాద్‌లో అభివృద్ధి సాధ్యమైందన్నారు. […]

Advertisement
Update:2019-03-14 12:17 IST

చంద్రబాబు పద్దతికి, జగన్‌ పద్దతికి చాలా తేడా ఉందని… జగన్‌ వస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుందనే తాను వైసీపీలో చేరినట్టు జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాస్‌ చెప్పారు. టీడీపీతో తనకు ఎలాంటి సంబంధాలు లేవన్నారు.

గతంలో ఒకసారి టీడీపీ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించినా చంద్రబాబు అవకాశం ఇవ్వలేదన్నారు. ఈ ఐదేళ్ల పాలన చూసిన తర్వాత చంద్రబాబు వల్ల ఎలాంటి ఉపయోగం రాష్ట్రానికి లేదని తాను ఒక నిర్ధారణకు వచ్చానన్నారు.

హైదరాబాద్‌ను చంద్రబాబు ఒక్కరే కాదని… మిగిలిన ముఖ్యమంత్రులంతా పనిచేస్తేనే హైదరాబాద్‌లో అభివృద్ధి సాధ్యమైందన్నారు. గోల్కొండ, చార్మినార్‌ కూడా చంద్రబాబే కట్టారా? అని ఎద్దేవా చేశారు. తాను సీటు ఆశించి వైసీపీలో చేరలేదన్నారు. చంద్రబాబును ఓడించండి అని ప్రచారం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు.

ఒకవేళ జగన్‌ ఆదేశిస్తే మాత్రం పోటీ చేస్తానన్నారు. జగన్‌ ఆదేశిస్తే నారా లోకేష్‌పై పోటీ చేసి ఓడించేందుకు కూడా సిద్ధమన్నారు. ఎన్టీఆర్‌ ప్రచారానికి వస్తారా లేదా అన్నది తాను చెప్పలేనన్నారు.

Tags:    
Advertisement

Similar News