మంగళగిరి అభ్యర్థి ఆర్కే.... ఇదే నిదర్శనం
ప్రత్యేక పనితీరుతో ఎమ్మెల్యేగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఈసారి టికెట్ వస్తుందా… రాదా… అన్న దానిపై కొద్దికాలంగా చర్చ జరుగుతోంది. సామాజిక సమీకరణాల్లో భాగంగా ఆర్కేను పక్కన పెట్టి వైసీపీ అభ్యర్థిగా మరొకరిని బరిలోకి దింపుతారన్న ప్రచారం జరుగుతూ వచ్చింది. ఇంతలో మంగళగిరి నుంచి టీడీపీ తరపున నారా లోకేష్ బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు. ఈనేపథ్యంలో వైసీపీ అభ్యర్థిగా ఆళ్ల రామకృష్ణారెడ్డే ఉంటారా? ఉండరా? అన్న దానిపై సాక్షి టీవీలో జరిగిన చర్చా కార్యక్రమంలో కొద్దిమేర స్పష్టత వచ్చింది. చర్చలో పాల్గొన్న […]
ప్రత్యేక పనితీరుతో ఎమ్మెల్యేగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఈసారి టికెట్ వస్తుందా… రాదా… అన్న దానిపై కొద్దికాలంగా చర్చ జరుగుతోంది. సామాజిక సమీకరణాల్లో భాగంగా ఆర్కేను పక్కన పెట్టి వైసీపీ అభ్యర్థిగా మరొకరిని బరిలోకి దింపుతారన్న ప్రచారం జరుగుతూ వచ్చింది.
ఇంతలో మంగళగిరి నుంచి టీడీపీ తరపున నారా లోకేష్ బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు. ఈనేపథ్యంలో వైసీపీ అభ్యర్థిగా ఆళ్ల రామకృష్ణారెడ్డే ఉంటారా? ఉండరా? అన్న దానిపై సాక్షి టీవీలో జరిగిన చర్చా కార్యక్రమంలో కొద్దిమేర స్పష్టత వచ్చింది.
చర్చలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆర్కే మంగళగిరిలో తనపై లోకేష్ కాదు… చంద్రబాబు పోటీ చేసినా ఓడిస్తానని ప్రకటించారు. రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేశానని చెబుతున్న చంద్రబాబే స్వయంగా తన మీద పోటీకి రావాలని ఆర్కే సవాల్ విసిరారు.
ఆర్కే ఈ వ్యాఖ్యలు చేయడం ద్వారా మంగళగిరి వైసీపీ అభ్యర్థి తానేనని క్లూ ఇచ్చారు. అంతే కాదు… చర్చలో పాల్గొనేందుకు ఫోన్ చేసిన కాలర్స్ ద్వారా చానల్ చర్చ నిర్వాహకులు లోకేష్‌పై పోటీ చేస్తున్నందుకు గాను… ఎమ్మెల్యే ఆర్కేకు ఆల్‌ది బెస్ట్ చెప్పించడం కూడా విశేషం.
ఒకవేళ ఆర్కేను కాకుండా మరొకరిని అభ్యర్థిగా నిలిపే ఆలోచన వైసీపీ నాయకత్వానికి ఉండి ఉంటే… సాక్షి టీవీలో ఆర్కేకు కాలర్స్ ద్వారా శుభాకాంక్షలు చెప్పించే పని చేసి ఉండేవారా?. ఏది ఏమైనా లోకేష్, ఆర్కే మంగళగిరి నుంచి బరిలో దిగితే పోరాటం ఆసక్తికరంగా ఉంటుంది.
కాబట్టి ఆర్కే అభ్యర్థిత్వాన్ని ఖాయం చేయడం వల్లే అటు ఆర్కే, ఇటు సాక్షి చానల్ ధైర్యంగా ఈ తరహాలోనే వ్యవహరించి ఉండవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అధికారిక జాబితా విడుదలైతే గానీ అభ్యర్థి ఎవరన్నది పూర్తి స్పష్టత రావొచ్చు. ఒకవేళ నారా లోకేష్… ఎమ్మెల్యే ఆర్కే తలబడితే రాష్ట్రంలోనే అత్యంతగా అందరి దృష్టిని ఆకర్షించే నియోజకవర్గంగా మంగళగిరి
నిలుస్తుందనడంలో ఎలాంటి అనుమానం లేదు.