కేసీఆర్‌కు 16 కష్టమేనా ?
తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో విశ్లేషకుల అంచనాలను కూడా తారుమారు చేస్తూ 88 సీట్లు నెగ్గిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. లోక్‌సభ ఎన్నికల్లో 17 సీట్లకు గాను 16 గెలవాలనే టార్గెట్ పెట్టారు. హైదరాబాద్ నియోజకవర్గంలో అసదుద్దీన్‌కి మద్దతు ఇస్తున్నాం కాబట్టి మిగిలిన సీట్లన్నీ మనవేనని ఆయన ప్రకటించారు. సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ప్రతీ సన్నాహక సమావేశంలో అదే అంకెలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ విశ్లేషకులు ప్రతీ నియోజకవర్గ […]
తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో విశ్లేషకుల అంచనాలను కూడా తారుమారు చేస్తూ 88 సీట్లు నెగ్గిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. లోక్‌సభ ఎన్నికల్లో 17 సీట్లకు గాను 16 గెలవాలనే టార్గెట్ పెట్టారు. హైదరాబాద్ నియోజకవర్గంలో అసదుద్దీన్‌కి మద్దతు ఇస్తున్నాం కాబట్టి మిగిలిన సీట్లన్నీ మనవేనని ఆయన ప్రకటించారు.
సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ప్రతీ సన్నాహక సమావేశంలో అదే అంకెలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ విశ్లేషకులు ప్రతీ నియోజకవర్గ డేటాను చూసి టీఆర్ఎస్ అన్ని నియోజకవర్గాలు గెలవడం కష్టమేనని చెబుతున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచిన నియోజకవర్గాల మెజార్టీని చూసినా 16 పార్లమెంటు సీట్లు కేసీఆర్ ఖాతాలో పడటం కష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల కంటే 2018 ఎన్నికల్లో 25 శాతం ఎక్కువ ఓట్లు టీఆర్ఎస్ ఖాతాలలో పడ్డాయి. కాని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ ఒకే సీటుకు పరిమితమైంది. ఇక నల్గొండ, రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ హవా నడిచింది.
ఉత్తర తెలంగాణలోని కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం టీఆర్ఎస్ ఖాతాలో పడుతుందో లేదో అనే చర్చ కూడా మొదలైంది. ఉత్తర తెలంగాణలోని మహబూబాబాద్, ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గాలతో పాటు నల్గొండ, మహబూబ్‌నగర్ ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్‌కు గట్టి పోటీ తప్పదు.
ఇక సికింద్రాబాద్ ఎంపీ సీట్‌లో నిలబెట్టే అభ్యర్థిని బట్టే అక్కడ ఓటింగ్ సరళి ఎలా ఉంటుందో తెలుస్తుంది. క్రిస్టియన్, ఆంధ్రా ఓట్లు ఎక్కువగా ఉన్న ఆ నియోజకవర్గంలో టీఆర్ఎస్ కరెక్ట్ అభ్యర్థిని నిలబెడితే తప్ప గెలుపు సాధ్యం కాదు.
ఇలా నియోజకవర్గాల వారీగా లెక్కలు తీసుకున్నా కేసీఆర్ లక్ష్యమైన 16ను చేరడం కష్టమేనంటున్నారు. మరి ప్రతీ నియోజకవర్గం తిరుగుతున్న కేటీఆర్ తన తండ్రి లక్ష్యాన్ని సాధిస్తారో లేదో చూడాలి మరి.