పరిటాల ఇంట్లో టికెట్ వివాదం

పరిటాల సునీత ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. తాను, తన కుమారుడు శ్రీరాం పోటీ చేసేందుకు వీలుగా రెండు టికెట్లు ఇవ్వాలని సునీత కోరుతూ వచ్చారు. అయితే చంద్రబాబు మాత్రం ఒక స్థానాన్ని మాత్రమే కేటాయించారు.  రాప్తాడు నియోజకవర్గానికి మరోసారి పరిటాల సునీతనే అభ్యర్థిగా ప్రకటించారు. కానీ పరిటాల శ్రీరాం తాను ఈ ఎన్నికల్లో పోటీ చేసి తీరుతానని పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో కుమారుడి కోసం పరిటాల సునీత తప్పుకున్నారు. తన స్థానంలో పరిటాల శ్రీరాం పోటీ చేస్తారని ఆమె ప్రకటించారు. శ్రీరాం పేరును […]

Advertisement
Update:2019-03-13 11:05 IST

పరిటాల సునీత ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. తాను, తన కుమారుడు శ్రీరాం పోటీ చేసేందుకు వీలుగా రెండు టికెట్లు ఇవ్వాలని సునీత కోరుతూ వచ్చారు. అయితే చంద్రబాబు మాత్రం ఒక స్థానాన్ని మాత్రమే కేటాయించారు.

రాప్తాడు నియోజకవర్గానికి మరోసారి పరిటాల సునీతనే అభ్యర్థిగా ప్రకటించారు. కానీ పరిటాల శ్రీరాం తాను ఈ ఎన్నికల్లో పోటీ చేసి తీరుతానని పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో కుమారుడి కోసం పరిటాల సునీత తప్పుకున్నారు. తన స్థానంలో పరిటాల శ్రీరాం పోటీ చేస్తారని ఆమె ప్రకటించారు.

శ్రీరాం పేరును పరిటాల సునీత ప్రకటించడంపై ఆమె కుటుంబంలోనే విభేదాలు బయలుదేరాయి. ఫ్యామిలీలో ఒక వర్గం పరిటాల శ్రీరాంను పోటీలోకి దింపడాన్ని వ్యతిరేకిస్తోంది. జిల్లాలో జేసీ కుమారులు ఇద్దరూ ఈసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.

ఇప్పుడు పరిటాల శ్రీరాం ఎన్నికల బరిలోకి దిగకపోతే జిల్లా రాజకీయాల్లో జేసీ కుమారుల కంటే జూనియర్ అవుతాడన్న భావనతో తన కుమారుడి టికెట్ కోసం పరిటాల సునీత తీవ్రంగా ప్రయత్నించారు. కానీ చంద్రబాబు పరిటాల కుటుంబానికి రెండు టికెట్లు ఇచ్చేందుకు అంగీకరించలేదు. దీంతో కుమారుడి కోసం పరిటాల సునీత తప్పుకున్నారు.

Tags:    
Advertisement

Similar News