జగన్ వెనుకే టాలీవుడ్....
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డికి టాలీవుడ్ అండ పెరుగుతోందా… పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఇప్పటికే హాస్యనటులు పృధ్వీ, క్రిష్ణుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ప్రముఖ నటి జయసుధ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తాజాగా ప్రముఖ హాస్య నటుడు ఆలీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ జగన్ తన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక వ్యాపార వేత్త, జూనియర్ ఎన్టీఆర్ మామ అయిన నార్నె శ్రీనివాస రావు కూడా పార్టీలో చేరిన […]
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డికి టాలీవుడ్ అండ పెరుగుతోందా… పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఇప్పటికే హాస్యనటులు పృధ్వీ, క్రిష్ణుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ప్రముఖ నటి జయసుధ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
తాజాగా ప్రముఖ హాస్య నటుడు ఆలీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ జగన్ తన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఇక వ్యాపార వేత్త, జూనియర్ ఎన్టీఆర్ మామ అయిన నార్నె శ్రీనివాస రావు కూడా పార్టీలో చేరిన విషయం విదితమే. తన స్నేహితుడికి టిక్కెట్టు ఇప్పించడానికి ప్రముఖ టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున వైఎస్ జగన్ ను కలిశారన్న ప్రచారం కూడా జరుగుతోంది.
ఆదివారం నాడు జరిగిన “మా” ఎన్నికలలో అధ్యక్షుడిగా నరేష్ గెలుపొందారు. అలాగే జీవిత, రాజశేఖర్, స్వతంత్ర అభ్యర్దిగా హేమ వంటి వారు జగన్ కు మద్దతు ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలువురు అంటున్నారు.
“మా” అధ్యక్షుడు నరేష్ “మా” సమస్యలు పరిష్కరించమని తాను తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావును కలిసానని పలుమార్లు నర్మగర్భంగా చెప్పారు. దీని బట్టి మా కొత్త కార్యవర్గానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మద్దతు ఉన్నట్లు భావించాలి.
ముందు ముందు ‘మా’ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ప్రచారం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.
నందమూరి వంశస్తుడు, ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ తన సోదరి సుహాసిని కుకట్ పల్లి నుంచి పోటీ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకలేదు. తన సోదరిని గెలిపించండీ అంటూ ట్విట్టర్ లో ఒక పోస్టు మాత్రమే పెట్టారు. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికే అవకాశం లేదు.
అంతే కాదు గతంలో ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు లాంటి వారు తెలుగుదేశం పార్టీకి తమ మద్దతును ప్రకటించారు. ఈ సారి వారేవ్వరూ కూడ తెలుగుదేశం పార్టీకి మద్దతు పలుకుతూ ఇప్పటి వరకూ ఎటువంటి ప్రకటనలు చేయకపోవడం గమనార్హం.
ఇవన్నీ వైఎస్ఆర్ పార్టీకి మేలు చేయకపోయినప్పటికీ, తెలుగుదేశం పార్టీకి కీడు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.