అమ్మో వేసవి..... రోగాలకు ఇలా చెక్ పెట్టండి

వేసవి కాలం ఎండలు మండించే కాలం. అంతే కాదు రోగాలను తిరగబెట్టే కాలం. దీర్ఘ రోగాలే కాదు సాధరణ రోగాలు కూడా వేసవిలో విజృంభిస్తాయి. ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరగడం, అందుకు తగ్గట్టుగా ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల వేసవిలో రోగాలు తమ ప్రతాపాన్ని చూపిస్తాయి. రోగాలు రావడం కంటే వాటిని ముందుగానే పలు జాగ్రత్తలతో అదుపుచేయవచ్చు. వేసవికాలంలో ఎక్కువగా వేధించే వ్యాధులలో ప్రధానమైనవి వడదెబ్బ, ఆస్తమా, సన్ బర్న్స్. వడదెబ్బ: వేసవిలో తరచు చాలా మంది […]

Advertisement
Update:2019-03-11 23:33 IST

వేసవి కాలం ఎండలు మండించే కాలం. అంతే కాదు రోగాలను తిరగబెట్టే కాలం. దీర్ఘ రోగాలే కాదు సాధరణ రోగాలు కూడా వేసవిలో విజృంభిస్తాయి. ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరగడం, అందుకు తగ్గట్టుగా ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల వేసవిలో రోగాలు తమ ప్రతాపాన్ని చూపిస్తాయి. రోగాలు రావడం కంటే వాటిని ముందుగానే పలు జాగ్రత్తలతో అదుపుచేయవచ్చు. వేసవికాలంలో ఎక్కువగా వేధించే వ్యాధులలో ప్రధానమైనవి వడదెబ్బ, ఆస్తమా, సన్ బర్న్స్.

వడదెబ్బ:

వేసవిలో తరచు చాలా మంది వడదెబ్బకు గురి అవుతారు. దీని కోసం మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

  • ముందుగా మనం ఎండ బాగా ఎక్కువగా ఉన్న సమయంలో బయటకి వెళ్లకుండా చూసుకోవాలి
  • బయటకి వెళ్లాల్సి వస్తే తలకు, ముక్కుకు స్కర్ఫ్ కట్టుకుని వెళ్లాలి.
  • కాఫీ, టీల జోలికి పోకుండా మజ్జిగా, కొబ్బరి బొండం లాంటివి తాగాలి.
  • చల్లగా ఉంటాయి కదా అని కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు. వీటి వల్ల తాత్కాలిక ఉపశమనం కలిగిన ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
  • మార్కెటింగ్ విభాగంలో పనిచేస్తున్న వారు, రవాణ రంగంలో పనిచేస్తున్న సిబ్బంది తదితరులు తమ వెంట మంచి నీళ్ల సీసను, ఓఆర్ఎస్, ఎలక్ట్రాల్ లాంటివి వెంట పెట్టుకోవాలి.
  • నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయాలు, తర్జూజా, కీర వంటివి ఎక్కువగా తీసుకోవాలి.
  • ఘనపదార్దల కంటే కూడా ద్రవపదార్ధలకే ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలి.

అవస్థల ఆస్తమాకు జాగ్రత్తలు

  • అస్తమా బాధితులు వేసవికాలమే కదా అని చల్లటి నీరు లేక ఇతర చల్లటి పదార్ధాల జోలికి వెళ్లకూడదు.
  • తమ వెంట ఆస్తమా మందులు తప్పనిసరిగా దగ్గర ఉంచుకోవాలి.
  • వేసవిలో వాతవరణంలో తేమ ఉండదు కాబట్టి దుమ్ము, ధూళి ఎక్కువగా ఉంటుంది, కాబట్టి బయటకి వెళ్లాల్సి వస్తే తప్పని సరిగా ముక్కుకి స్కార్ఫ్ కట్టుకుని వెళ్లాలి.
  • ఆస్తమా అనగానే శీతకాలంలో జాగ్రత్తలు తీసుకుని వేసవి కాలం వచ్చేసరికి నిర్లక్ష్యం చేస్తారు. ఇది ఎంత మాత్రం తగదు. వేసవి కూడా ఆస్తమా రోగులను పీడిస్తుందనే విషయాన్ని గుర్తుంచుకుని జాగ్రత్తలు తీసుకోవాలి.

సన్‌బర్న్‌

వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. సూర్యరశ్మిలో అల్ట్ర వయెలెట్ రేస్ వలన చర్మం కమిలిపోతుంది. కొంతమందికి చర్మం ఎరుపు రంగులోకి మారుతుంది, శరీరంపై దద్దుర్లు, పొక్కులు, చెమట కాయలు వంటివి ఇబ్బంది పెడతాయి. వీటికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

  • ఎండలో బయటకి వెళ్లేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్ తప్పకుండా చర్మానికి రాసుకోవాలి.
  • వేసవిలో వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి.
  • మన శరీరానికి అనువుగా ఉండే బట్టలను ధరించాలి.
  • సాధ్యమైనంత వరకూ కాటన్, నూలు వస్త్రాలు ధరించడం మంచిది.
  • ఇంట్లో ఉన్న ఎయిర్ కూలర్లు, ఎయిర్ కండీషనర్లు తప్పకుండా సర్వీస్ చేయించుకోవాలి. లేకపోతే చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
Tags:    
Advertisement

Similar News