పాంచ్ పటాకా వన్డే సిరీస్ లో ఆఖరాట

న్యూఢిల్లీ వేదికగా ఆసీసీ-టీమిండియా డూ ఆర్ డై ఫైట్ మొదటి నాలుగు వన్డేల్లో 2-2తో సమఉజ్జీలుగా టీమిండియా, ఆసీస్ హోంగ్రౌండ్లో విరాట్ కొహ్లీ సత్తాకు మరో పరీక్ష టీమిండియా-ఆస్ట్రేలియాజట్ల పాంచ్ పటాకా వన్డే సిరీస్ క్లైయ్ మాక్స్ దశకు చేరింది. మొదటి నాలుగు వన్డేల్లో రెండుజట్లూ చెరో రెండుమ్యాచ్ లూ నెగ్గి 2-2తో సమఉజ్జీలుగా నిలవడంతో… విజేత ను నిర్ణయించే ఆఖరిపోరాటానికి…న్యూ ఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది. ఈమ్యాచ్ లో నెగ్గిన జట్టుకే సిరీస్ విజేతగా […]

Advertisement
Update:2019-03-12 07:37 IST
  • న్యూఢిల్లీ వేదికగా ఆసీసీ-టీమిండియా డూ ఆర్ డై ఫైట్
  • మొదటి నాలుగు వన్డేల్లో 2-2తో సమఉజ్జీలుగా టీమిండియా, ఆసీస్
  • హోంగ్రౌండ్లో విరాట్ కొహ్లీ సత్తాకు మరో పరీక్ష

టీమిండియా-ఆస్ట్రేలియాజట్ల పాంచ్ పటాకా వన్డే సిరీస్ క్లైయ్ మాక్స్ దశకు చేరింది. మొదటి నాలుగు వన్డేల్లో రెండుజట్లూ చెరో రెండుమ్యాచ్ లూ నెగ్గి 2-2తో సమఉజ్జీలుగా నిలవడంతో… విజేత ను నిర్ణయించే ఆఖరిపోరాటానికి…న్యూ ఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది.

ఈమ్యాచ్ లో నెగ్గిన జట్టుకే సిరీస్ విజేతగా నిలిచే అవకాశం ఉండడంతో… మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.

రసపట్టుగా మారిన సిరీస్….

ప్రపంచకప్ కు సన్నాహకంగా ఐదుసార్లు చాంపియన్ ఆస్ట్రేలియా, మాజీ చాంపియన్ టీమిండియా జట్ల మధ్య జరుగుతున్న పాచ్ పటాకా వన్డే సిరీస్…రసపట్టుగా మారింది.

మొదటి నాలుగు వన్డేలలో రెండుజట్లూ ..చెరో రెండుమ్యాచ్ లు నెగ్గడంతో…న్యూఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వేదికగా జరిగే ఆఖరి వన్డే …నిర్ణయాత్మకంగా మారింది. ఈ మ్యాచ్ లో నెగ్గిన జట్టుకే సిరీస్ విజేతగా నిలిచే అవకాశం ఉండడంతో…రెండుజట్లూ చావోబతుకో సమరానికి సిద్ధమయ్యాయి.

హోరాహోరీగా….

హైదరాబాద్, నాగపూర్ వేదికలుగా జరిగిన మొదటి రెండు వన్డేలలో ఆతిథ్య టీమిండియా…. రాంచీ, మొహాలీ వేదికలుగా ముగిసిన మూడు, నాలుగు వన్డేలలో ఆస్ట్రేలియా…బ్యాక్ టు బ్యాక్ విజయాలు సాధించడంతో…సిరీస్ 2-2తో సమమయ్యింది.

ఓ వైపు…ఆరవ ర్యాంకర్ ఆస్ట్రేలియా వరుస విజయాలతో దూకుడుమీదుంటే…మరోవైపు టీమిండియా మాత్రం వరుస పరాజయాలతో ఆత్మరక్షణలో పడిపోయింది.

పసలేని టీమిండియా బౌలింగ్….

మొహాలీ వన్డేలో 358 పరుగుల భారీస్కోరు సాధించినా…కాపాడుకోలేకపోయింది. రాంచీ, మొహాలీ వికెట్లపై కంగారూ టాపార్డర్ దూకుడును అడ్డుకోడంలో టీమిండియా బౌలింగ్ ఎటాక్ దారుణంగా విఫలమయ్యింది.

కంగారూ ఓపెనర్లు ఉస్మాన్ క్వాజా, ఆరోన్ ఫించ్, సూపర్ హిట్టర్ మాక్స్ వెల్, హ్యాండ్స్ కోంబ్, యువ ఆటగాడు టేలర్ పూర్తి ఫామ్ లోకి రావడంతో… భారత బౌలర్లకు కష్టాలు ప్రారంభమయ్యాయి.

అయితే…ఢిల్లీ వేదికగా ఇప్పటి వరకూ 20 వన్డేల్లో తలపడిన టీమిండియాకు 12 విజయాలు ఉన్నాయి.

ఆసీస్ దే పైచేయి….

మొహాలీ వన్డే వరకూ రెండుజట్ల ఫేస్ టు ఫేస్ రికార్డులు చూస్తే…ఆస్ట్రేలియాదే పైచేయిగా ఉంది. ఆస్ట్రేలియా పై టీమిండియాకు 49 విజయాలు, 76 పరాజయాల రికార్డు ఉంది. న్యూఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా స్లో వికెట్ పై…. రెండుజట్ల సత్తాకు సవాలు కానుంది.

అంతేకాదు..కెప్టెన్ విరాట్ కొహ్లీకి ఢిల్లీ హోంగ్రౌండ్ కూడా కావడం, సిరీస్ కే నిర్ణయాత్మక మ్యాచ్ కావడంతో పోటీ ఆఖరి బంతి వరకూ… హోరాహోరీగా సాగటం ఖాయంగా కనిపిస్తోంది.

కోట్లా…. ఆటలో…. నాకౌట్ పంచ్ ఏ జట్టు కొడుతుందో తెలుసుకోవాలంటే…. మరికొద్ది గంటలపాటు సస్పెన్స్ భరించక తప్పదు.

Tags:    
Advertisement

Similar News