కాలువ కాచుకో... ఓడిస్తా....
అనంతపురం జిల్లా రాయదుర్గంలో మంత్రి కాలువ శ్రీనివాస్‌కు సొంత పార్టీలోనే ఎదురుగాలి వీస్తోంది. గత ఎన్నికల్లో కాలువ శ్రీనివాస్ గెలుపు కోసం పనిచేసిన జేసీ అల్లుడు, టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఈసారి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. మరోసారి కాలువ శ్రీనివాస్‌కే చంద్రబాబు రాయదుర్గం టికెట్ ఖాయం చేయడంతో దీపక్ రెడ్డి తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. కార్యకర్తల సలహా మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. టీడీపీ కార్యకర్తల్లోనే 20 వేల నుంచి 30వేల మంది కాలువ శ్రీనివాస్‌కు వ్యతిరేకంగా ఉన్నారని […]
అనంతపురం జిల్లా రాయదుర్గంలో మంత్రి కాలువ శ్రీనివాస్‌కు సొంత పార్టీలోనే ఎదురుగాలి వీస్తోంది. గత ఎన్నికల్లో కాలువ శ్రీనివాస్ గెలుపు కోసం పనిచేసిన జేసీ అల్లుడు, టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఈసారి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు.
మరోసారి కాలువ శ్రీనివాస్‌కే చంద్రబాబు రాయదుర్గం టికెట్ ఖాయం చేయడంతో దీపక్ రెడ్డి తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. కార్యకర్తల సలహా మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. టీడీపీ కార్యకర్తల్లోనే 20 వేల నుంచి 30వేల మంది కాలువ శ్రీనివాస్‌కు వ్యతిరేకంగా ఉన్నారని దీపక్ రెడ్డి వివరించారు.
నియోజకవర్గంలో అసలైన టీడీపీ కార్యకర్తలను అణచివేసి, సొంత వ్యక్తులను, దొంగలను మంత్రి కాలువ అందలం ఎక్కిస్తున్నారని, అందుకే దీన్ని అడ్డుకునేందుకు ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నట్టు చెప్పారు. మంత్రి కాలువ శ్రీనివాస్‌ను ఓడించి తీరడమే తన లక్ష్యమని దీపక్ రెడ్డి ప్రకటించారు.