ఏపీలో మొదలైన పసుపు ప్రలోభాలు !
ఎన్నికల డేట్లు అలా వచ్చాయి. ఇలా ఏపీలో పంపిణీ కార్యక్రమం మొదలైంది. ఓటర్లను ప్రలోభ పెట్టే కార్యక్రమాలకు అధికార తెలుగుదేశం తెరలేపింది. ఒక్క నియోజకవర్గంలో కాదు… చాలా నియోకవర్గాల్లో ఈ కార్యక్రమం మొదలైంది. ప్రధానంగా వైసీపీలో బలంగా ఉన్న సీట్లనే టార్గెట్ చేశారు. అంతేకాకుండా మంత్రులు, ఇతర ముఖ్య నేతలు ఓడిపోతారనే నియోజకవర్గంలో ఈ ప్రలోభాల పర్వం పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ రాకముందే కొన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఓటర్లకు పంచేందుకు సైకిళ్లు దిగుమతి […]
ఎన్నికల డేట్లు అలా వచ్చాయి. ఇలా ఏపీలో పంపిణీ కార్యక్రమం మొదలైంది. ఓటర్లను ప్రలోభ పెట్టే కార్యక్రమాలకు అధికార తెలుగుదేశం తెరలేపింది. ఒక్క నియోజకవర్గంలో కాదు… చాలా నియోకవర్గాల్లో ఈ కార్యక్రమం మొదలైంది. ప్రధానంగా వైసీపీలో బలంగా ఉన్న సీట్లనే టార్గెట్ చేశారు. అంతేకాకుండా మంత్రులు, ఇతర ముఖ్య నేతలు ఓడిపోతారనే నియోజకవర్గంలో ఈ ప్రలోభాల పర్వం పెద్ద ఎత్తున జరుగుతున్నాయి.
ఎన్నికల షెడ్యూల్ రాకముందే కొన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఓటర్లకు పంచేందుకు సైకిళ్లు దిగుమతి చేశారు. ఏపీ సాగునీటి శాఖ మంత్రి దేవినేని ఉమ మైలవరం లో గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ఈ సారి ఆయన గెలిచేది కష్టమే అని సర్వేలు చెబుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లోద దేవినేని ఉమ ప్రలోభాలకు తెరలేపారు. ఇప్పటికే ఆయన తోపుడు బండ్లు పంపిణీ చేశారు. అర్ధరాత్రి తోపుడు బండ్లు పంపిణీ చేస్తున్న ఫొటోలు బయటకు వచ్చాయి. ఇప్పుడు ఆయన నియోజకవర్గంలో సైకిళ్లు కూడా పంపిణీ మొదలు పెట్టారని తెలుస్తోంది.
షెడ్యూల్ వచ్చి 24 గంటలు గడిచిందో లేదో….పెనమలూరులో టీడీపీ ఎమ్మెల్యే బోడెప్రసాద్ ప్రలోభాల పర్వానికి తెరలేపారు. కంకిపాడు మండలం ఈడుపుగల్లులో టీడీపీ సైకిళ్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు భారీగా పట్టుకున్నారు. చంద్రబాబు ఫొటోలతో పాటు పసుపు రంగులో పంపిణీకి సిద్ధంగా ఉన్న సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇదే సీన్ బయటపడింది. పెద్దకన్నలి గ్రామము లో సైకిళ్ల పంపిణీకి రంగం సిద్ధం చేశారు, అయితే ఈ సైకిళ్లను ఎవరు కొన్నారు అనేది చర్చనీయాంశంగా మారింది. 8,9,10వ తరగతి విద్యార్థులకు పంపిణీ చేసేందుకు ఇంతకుముందు ఏపీ ప్రభుత్వం సైకిళ్లను కొన్నది. అప్పట్లో కొన్ని సైకిళ్లను కూడా పంపిణీ చేసింది. ఆ సైకిళ్లను ఇన్నాళ్లు దాచిపెట్టిన నేతలు…ఇప్పుడు బయటకు తీశారా? అనేది ఓ ప్రశ్న. ఈ సైకిళ్లను ప్రభుత్వ సొమ్ముతో కొని ఇప్పుడు పంపిణీ చేస్తున్నారా? అనేది మరో డౌట్. మొత్తానికి ఈ సైకిళ్ల పంపిణీ కూడా ఓ పెద్ద కుంభకోణం లాగే కనిపిస్తోంది.