మొహాలీ వన్డేలో ధావన్ " రోహిత్ రికార్డు భాగస్వామ్యం
మొదటి వికెట్ కు 193 పరుగులతో సరికొత్త రికార్డు 178 పరుగుల గత రికార్డును 193 పరుగులతో అధిగమించిన ధావన్- రోహిత్ ధావన్ 115 బాల్స్ లో 18 బౌండ్రీలు, 3 సిక్సర్లతో 143 పరుగులు రోహిత్ శర్మ 92 బాల్స్ లో 7 బౌండ్రీలు, 2 సిక్సర్లతో 95 పరుగులు టీమిండియా ఓపెనర్ల జోడీ రోహిత్ శర్మ- శిఖర్ ధావన్…మొహాలీ వన్డేలో తమ అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఆస్ట్రేలియాతో ముగిసిన నాలుగో వన్డేలో… భారతజోడీ మొదటి […]
- మొదటి వికెట్ కు 193 పరుగులతో సరికొత్త రికార్డు
- 178 పరుగుల గత రికార్డును 193 పరుగులతో అధిగమించిన ధావన్- రోహిత్
- ధావన్ 115 బాల్స్ లో 18 బౌండ్రీలు, 3 సిక్సర్లతో 143 పరుగులు
- రోహిత్ శర్మ 92 బాల్స్ లో 7 బౌండ్రీలు, 2 సిక్సర్లతో 95 పరుగులు
టీమిండియా ఓపెనర్ల జోడీ రోహిత్ శర్మ- శిఖర్ ధావన్…మొహాలీ వన్డేలో తమ అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఆస్ట్రేలియాతో ముగిసిన నాలుగో వన్డేలో… భారతజోడీ మొదటి వికెట్ కు 30 ఓవర్లలో 193 పరుగుల భాగస్వామ్యం సాధించారు.
రోహిత్- ధావన్ జోడీ ఇప్పట ివరకూ 4వేల 333 పరుగులు సాధించడం ద్వారా… వన్డే చరిత్రలోనే నాలుగో అత్యుత్తమ ఓపెనింగ్ జోడీగా రికార్డుల్లో చేరారు.
వన్డే క్రికెట్ చరిత్రలో సౌరవ్ గంగూలీ-సచిన్ టెండుల్కర్ జోడీ 6వేల 609 పరుగులు, ఆడం గిల్ క్రిస్ట్- మాథ్యూహేడెన్ 5 వేల 372 పరుగులు, గార్డన్ గ్రీనిడ్జ్- డెస్మండ్ హేన్స్ 5 వేల 150 పరుగులతో…. మొదటి మూడు అత్యుత్తమ ఓపెనింగ్ జోడీలుగా నిలిచారు.