వివాదంలో క్రికెట్ డీఆర్‌ఎస్ విధానం
క్రికెట్‌లో బాల్ ట్రాకింగ్ కోసం వాడుతున్న టెక్నాలజీపై విమర్శలు వస్తున్నాయి. బాల్ ట్రాకింగ్ కోసం వాడుతున్న హక్‌ఐ టెక్నాలజీపై అభ్యంతరాలు వస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే అంపైర్ నిర్ణయ పునర్‌సమీక్ష పద్దతి- డీఆర్‌ఎస్ రెండోసారి వివాదమైంది. ఆసీస్‌తో రాంచీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కుల్దీప్ విసిరిన బంతికి ఆసీస్ కెప్టెన్ ఫించ్ ఎల్బీగా అవుటయ్యారు. దీనిపై ఫించ్ డీఆర్‌ఎస్‌కు వెళ్లగా అక్కడ కూడా ఔవుటనే వచ్చింది. దాంతో ఫించ్ వెళ్లిపోయాడు. కాగా బంతిని ట్రాకింగ్ చేసేందుకు వాడిన […]
క్రికెట్‌లో బాల్ ట్రాకింగ్ కోసం వాడుతున్న టెక్నాలజీపై విమర్శలు వస్తున్నాయి. బాల్ ట్రాకింగ్ కోసం వాడుతున్న హక్‌ఐ టెక్నాలజీపై అభ్యంతరాలు వస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే అంపైర్ నిర్ణయ పునర్‌సమీక్ష పద్దతి- డీఆర్‌ఎస్ రెండోసారి వివాదమైంది.
ఆసీస్‌తో రాంచీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కుల్దీప్ విసిరిన బంతికి ఆసీస్ కెప్టెన్ ఫించ్ ఎల్బీగా అవుటయ్యారు. దీనిపై ఫించ్ డీఆర్‌ఎస్‌కు వెళ్లగా అక్కడ కూడా ఔవుటనే వచ్చింది. దాంతో ఫించ్ వెళ్లిపోయాడు. కాగా బంతిని ట్రాకింగ్ చేసేందుకు వాడిన హక్‌ఐ టెక్నాలజీ కూడా తప్పుడు నిర్ణయం వెల్లడించిందని విమర్శలు వస్తున్నాయి.
కుల్దీప్ విసిరిన బంతి పిచ్ అయ్యే క్రమంలో మిడిల్ స్టంప్ నుంచి మిడిల్ వికెట్‌ను తాకేలా తిరుగుతూ వెళ్తోంది. కానీ బాల్ ట్రాకింగ్ టెక్నాలజీ మాత్రం బంతి లెగ్ స్టంప్‌లో పడి మిడిల్ స్టంప్ వైపు వెళ్తున్నట్టుగా చూపించింది. దాంతో డీఆర్‌ఎస్ విధానంలో లోపాలున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.