నా ఇద్దరు పిల్లలు నేను మరాఠీలో మాట్లాడుతాను : పవన్ కల్యాణ్
ప్రతి ఒక్కరూ కనీసం ఐదు భాషలు నేర్చుకోవాలని మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోరారు.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థుల తరఫున నేడు రెండో రోజు ప్రచారం చేశారు. ఇవాళ బల్లార్పూర్ లో ఎన్డీయే అభ్యర్థి సుధీర్ ముంగటివార్‌కు మద్దతుగా పవన్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ తనకు మరాఠీ భాష అంటే గౌరవం అని తెలిపారు. భాష పట్ల గౌరవంతో మరాఠీ నేర్చుకున్నానని, తన ఇద్దరు పిల్లలతో మరాఠీలో మాట్లాడతానని వెల్లడించారు. విదేశీ భాషలు నేర్చుకోవడంపై ఆసక్తి చూపించే మనం... మన సరిహద్దు రాష్ట్రాల భాషలు కూడా నేర్చుకోవాలని సూచించారు.
ప్రతి ఒక్కరూ కనీసం ఐదు ప్రాంతీయ భాషలు నేర్చుకోవాలని పవన్ కల్యాణ్ కోరారు. ఇక, రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ... తాను ఏపీలో మార్పు తీసుకొచ్చి చూపించానని, వైసీపీని ఓడించలేరు అంటే ఓడించి చూపించానని వ్యాఖ్యానించారు. ఇప్పుడు మరాఠా ప్రజలకు కూడా ఎన్డీయే ప్రభుత్వాన్ని గెలిపించి, అభివృద్ధి కొనసాగేందుకు దోహదపడాలని పిలుపునిచ్చారు. మహారాష్ట్ర అభివృద్ధి చెందాలన్నా, బల్లార్పూర్ అభివృద్ధి చెందాలన్నా, రూ.లక్ష కోట్ల ఆర్థిక వ్యవస్థగా మహారాష్ట్ర అవతరించాలన్నా... ఎన్డీయే కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని అన్నారు. తెలంగాణ అంటే నా గుండె ఎలా కొట్టుకుంటుందో.. జై తెలంగాణ అంటూ పేర్కొన్నారు. బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి నాకు ఇష్టమైన పాట.. తెలంగాణ పోరాటాల గడ్డ అని కొనియాడారు. తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయింది. ఆరు గ్యారెంటీల్లో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదంటూ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్ తెలిపారు.