కేటీఆర్‌ కు టైకాన్‌ కేరళ ఆహ్వానం

డిసెంబర్‌ 4, 5 తేదీల్లో కొచీలో ది ఇండస్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ సమ్మిట్‌

Advertisement
Update:2024-11-17 14:13 IST

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కు టైకాన్‌ కేరళ -2024 సమ్మిట్‌ ఆహ్వానం పలికింది. 13వ ది ఇండస్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ కాన్ఫరెన్స్‌ (టైకాన్‌) డిసెంబర్‌ 4, 5 తేదీల్లో కొచీలోని గ్రాండ్‌ హయత్‌ హోటల్‌ లో నిర్వహించనున్నారు. ఈ సదస్సులో వివిధ రంగాల సీఈవోలు, స్టార్టప్‌ ల వ్యవస్థాపకులు, ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్‌ లు వెయ్యి మందికి పైగా పాల్గొననున్నారు. ''మిషన్‌ - 2030 - ట్రాన్స్‌ఫార్మింగ్‌ కేరళ'' థీమ్‌ తో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ఐదో తేదీన సాయంత్రం జరిగే టైకాన్‌ ముగింపు వేడుకల్లో పాల్గొనాలని కేటీఆర్‌ ను ఆహ్వానించారు. టై కేరళ అధ్యక్షుడు జాకబ్‌ జోయ్‌, టైకాన్‌ చైర్మన్‌ వివేక్‌ కృష్ణగోవింద్‌ కు కేటీఆర్‌ కు ఆహ్వానం పంపారు.

రైతులకు సంకెళ్లు వేసినందుకా.. భూములు గుంజుకున్నందుకా.. ఏఐసీసీ సంతృప్తి ఎందుకు?

11 నెలల కాంగ్రెస్‌ పాలనపై ఏఐసీసీ ఎందుకు సంతృప్తిగా ఉందో చెప్పాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ ను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా ప్రశ్నించారు. అసలు రాష్ట్రంలో పాలన అనేది ఉందా? ఇంతకంటే దిక్కుమాలిన ప్రకటన ఇంకోటి ఉంటదా అని మండిపడ్డారు. ''తెలంగాణ రైతులకు సంకెళ్లు వేసినందుకా? అమాయకులైన అన్నదాతలను జైలులో పెట్టినందుకా.. కొడంగల్ లో బలవంతంగా భూములు గుంజుకున్నందుకా.. కొనుగోలు కేంద్రాల్లో రైతులను బలిపశువులను చేస్తున్నందుకా.. మూసీ ప్రాజెక్టులో భాగంగా వేల ఇళ్ల కూల్చివేతకు సిద్ధమైనందుకా.. హైడ్రా పేరిట పేద ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నందుకా.. ఏడాది కావస్తున్నా గ్యారెంటీ కార్డును పాతాళంలో పాతిపెట్టినందుకా.. రెండు లక్షల ఉద్యోగాల హామీ అమలును గాలికి వదిలేసినందుకా.. తెలంగాణ ప్రగతికి బ్రేకులు వేసి.. ఆర్థికంగా దివాలా తీయిస్తున్నందుకా.. సంక్షేమానికి సమాధి కట్టి.. అభివృద్ధికి అడ్రస్ లేకుండా చేసినందుకా.. తెలంగాణలోని సకల రంగాలను.. సబ్బండ వర్గాలను దగా చేసినందుకా.. మొత్తంగా తెలంగాణను ఆగం చేసినందుకా.. మీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి అంతటి సంతృప్తి??'' అని ప్రశ్నించారు. ''ఢిల్లీకి అందుతున్న వేల కోట్ల మూటలు చూసి మీరెంత మురిసిపోయినా.. మాటిచ్చి మోసం చేసిన ముఖ్యమంత్రిని.. గ్యారెంటీ కార్డు ఇచ్చి గారడీ చేసిన కాంగ్రెస్ పార్టీని చూసి నాలుగు కోట్ల తెలంగాణ సమాజం మాత్రం రగిలిపోతోంది. కనికరం లేని కాంగ్రెస్ పాలనకు కర్రుగాల్చి వాతపెడుతుంది..'' అని హెచ్చరించారు.

Tags:    
Advertisement

Similar News