మొహాలీ వేదికగా సూపర్ సండే వన్డే ఫైట్

టీమిండియాను ఊరిస్తున్న సిరీస్ విజయం మూడో వన్డే గెలుపుతో కంగారూ జోష్ నాలుగో వన్డేకి రెండుమార్పులతో టీమిండియా ప్రపంచకప్ కు సన్నాహకంగా…ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా, మాజీ చాంపియన్ టీమిండియా జట్ల మధ్య జరుగుతున్న పాంచ్ పటాకా వన్డే సిరీస్ హాట్ హాట్ గా మారింది. రాంచీ లో ముగిసిన మూడో వన్డే విజయంతో కంగారూ టీమ్ సిరీస్ ఆశలు సజీవంగా నిలుపుకోడంతో….మొహాలీ వేదికగా మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యే నాలుగో వన్డే సిరీస్ కే నిర్ణయాత్మకంగా మారింది. ఆతిథ్య టీమిండియా రెండుమార్పులతో […]

Advertisement
Update:2019-03-09 13:40 IST
  • టీమిండియాను ఊరిస్తున్న సిరీస్ విజయం
  • మూడో వన్డే గెలుపుతో కంగారూ జోష్
  • నాలుగో వన్డేకి రెండుమార్పులతో టీమిండియా

ప్రపంచకప్ కు సన్నాహకంగా…ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా, మాజీ చాంపియన్ టీమిండియా జట్ల మధ్య జరుగుతున్న పాంచ్ పటాకా వన్డే సిరీస్ హాట్ హాట్ గా మారింది.

రాంచీ లో ముగిసిన మూడో వన్డే విజయంతో కంగారూ టీమ్ సిరీస్ ఆశలు సజీవంగా నిలుపుకోడంతో….మొహాలీ వేదికగా మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యే నాలుగో వన్డే సిరీస్ కే నిర్ణయాత్మకంగా మారింది. ఆతిథ్య టీమిండియా రెండుమార్పులతో కంగారూలను ఢీ కొనబోతోంది….

టగ్-ఆఫ్- వార్…

టీమిండియా-ఆస్ట్రేలియా జట్ల పాంచ్ పటాకా వన్డే సిరీస్ నువ్వానేనా అన్నట్లుగా సాగుతోంది. రెండో ర్యాంకర్ టీమిండియాకు … ఆరో ర్యాంకర్ ఆస్ట్రేలియా అడుగడుగునా పోటీ ఇస్తూ… సిరీస్ ను రక్తికట్టిస్తోంది.

హైదరాబాద్ వేదికగా ముగిసిన తొలివన్డేలో 6 వికెట్లతో నెగ్గిన టీమిండియా…. నాగపూర్ లో ముగిసిన రెండో వన్డే లో సైతం విజేతగా నిలవడం ద్వారా 2-0తో పైచేయి సాధించింది.

అయితే…రాంచీలోని జార్ఖండ్ క్రికెట్ సంఘం ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన హైస్కోరింగ్ మూడో వన్డేలో కంగారూటీమ్ రివర్స్ ఎటాక్ తో టీమిండియా వరుస విజయాలకు గండి కొట్టి… సిరీస్ అవకాశాలను సజీవంగా నిలుపుకొంది.

ఆసీస్ రికార్డు….

వన్డే క్రికెట్ చరిత్రలోనే… వందోసారి 300కు పైగా స్కోరు సాధించిన ఆస్ట్రేలియా బ్యాటింగ్…గాడిలో పడినట్లే కనిపిస్తోంది. కెప్టెన్ కమ్ ఓపెనర్ ఆరోన్ పించ్, సెంచరీ హీరో ఉస్మాన్ క్వాజా, మాడ్ మాక్స్ హిట్టర్ మాక్స్ వెల్, షాన్ మార్ష్ పూర్తిస్థాయిలో రాణించగలిగితే….టీమిండియాకు మరోసారి కష్టాలు తప్పవు.

కొహ్లీ ఒంటరి పోరాటం

మరోవైపు…టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో…కెప్టెన్ విరాట్ కొహ్లీ మినహా ఏ ఒక్క ఆటగాడు నిలకడగా రాణించలేకపోడం ప్రధాన బలహీనతగా కనిపిస్తోంది. కొహ్లీ ఒక్కడే వరుస సెంచరీలతో ఒంటిరిపోరాటం చేసినా …మిశ్రమఫలితాలతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది.

దీనికితోడు…వెటరన్ వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీ, సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీలకు ఆఖరి రెండు వన్డేలలో విశ్రాంతి ఇచ్చి…యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్, భువనేశ్వర్ కుమార్ లకు అవకాశం కల్పించడంతో…భారత తుది జట్టులో రెండు లేదా మూడుమార్పులు అనివార్యంకానుంది.

మొహాలీలో 10 విజయాల భారత్…

ఇక…సిరీస్ కే నిర్ణయాత్మకంగా మారిన మొహాలీలోని పంజాబ్ క్రికెట్ స్టేడియం వికెట్.. బ్యాటింగ్ తో పాటు స్పిన్ బౌలర్లకు అనువుగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మొహాలీ వేదికగా ఇప్పటి వరకూ 24 వన్డేలు ఆడిన టీమిండియా 10 విజయాల రికార్డుతో ఉంది.

ఇక…ఆస్ట్రేలియా ప్రత్యర్థిగా టీమిండియా 49 విజయాలు, 75 పరాజయాల రికార్డుతో ఉంది. ఐదుమ్యాచ్ ల సిరీస్ లో ఇప్పటికే 2-1 ఆధిక్యం సాధించిన టీమిండియా…మొహాలీ వన్డేలో సైతం నెగ్గి 3-1తో సిరీస్ ఖాయం చేసుకొంటుందా? లేక కంగారూ టీమ్ బ్యాక్ టు బ్యాక్ విజయాలతో 2-2తో సమఉజ్జీగా నిలుస్తుందా? తెలుసుకోవాలంటే…మరికొద్దిగంటలపాటు వేచిచూడక తప్పదు.

Tags:    
Advertisement

Similar News