నంద్యాలలో ఆదుకున్న "డేటా".... ఇప్పుడు ముంచేసిందా?

నారా చంద్రబాబు నాయుడు. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితం ఉన్న మనిషి. రాజకీయాలలో ఆరితేరిన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. చివరి క్షణం వరకు ఏదో ఒకటి చేసి అధికారాన్ని నిలబెట్టుకోవడమే పరమావధిగా భావించే నాయకుడు. తనను ఇబ్బందుల పాలు చేసే వారే కాదు…. తనకు సహకరించిన వారిని సైతం చివరిక్షణంలో ముంచేసే నాయకుడిగా కూడా పేరు తెచ్చుకున్న వారు. దీనికి తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. రానున్న శాసనసభ, లోక్ స‌భ‌ ఎన్నికలలో తెలుగుదేశం […]

Advertisement
Update:2019-03-08 07:17 IST

నారా చంద్రబాబు నాయుడు. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితం ఉన్న మనిషి. రాజకీయాలలో ఆరితేరిన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. చివరి క్షణం వరకు ఏదో ఒకటి చేసి అధికారాన్ని నిలబెట్టుకోవడమే పరమావధిగా భావించే నాయకుడు. తనను ఇబ్బందుల పాలు చేసే వారే కాదు…. తనకు సహకరించిన వారిని సైతం చివరిక్షణంలో ముంచేసే నాయకుడిగా కూడా పేరు తెచ్చుకున్న వారు. దీనికి తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.

రానున్న శాసనసభ, లోక్ స‌భ‌ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలు అవుతుందని గ్రహించిన చంద్రబాబు నాయుడు తన చివరి అస్త్రంగా ‘సేవా మిత్ర యాప్’ వాడుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. తొలిసారిగా చంద్రబాబు ఒకటి తలిస్తే… వాస్తవం మాత్రం మరొకటి అయింది.

చంద్రబాబు నాయుడు నిర్మాణ సారథ్యంలో కుమారుడు లోకేష్ దర్శకత్వంలో ప్రారంభమైనప్పటికీ అనూహ్య పరిణామాల మధ్య ఈ నూతన రాజకీయ సినిమా ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు బోల్తా కొట్టింది.

నంద్యాల ఉప ఎన్నికల్లో లాప్‌టాప్, టాబ్ లు పట్టుకుపోయి మీ ఇంట్లో ఈ ప్రభుత్వ పధకాలు అనుభవిస్తున్నారు,ఓటెయ్యకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని బెదిరించిన విషయం పాత పేపర్లు తిరగేస్తే తెలుస్తుంది. అదే ఫార్ములా రాష్ట్రమంతా అమలు చెయ్యాలని టాబ్ లు పట్టుకుని తిరిగారు, జనం ఎదురు తిరిగి పోలీసులకు అప్పగించిన విషయం పేపర్లలో చదివాం. ఇంకా ఎన్నికలు రాకముందే ఐటీ గ్రిడ్స్ విషయం బయటకు రావడంతో టీడీపీ ప్లాన్ ఫెయిల్ అయింది.

ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు సంబంధించిన ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, కుటుంబ సభ్యుల వివరాలు, వారి ఆస్తులు, అప్పులు, బ్యాంక్ అకౌంట్ నెంబర్లు…. అన్ని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోకి వెళ్లిపోయాయని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఐటీ సంస్థ ద్వారా అత్యంత రహస్యంగా చేపట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత వ్యవహారాల రహస్య నివేదిక బట్టబయలు కావడంతో చంద్రబాబు నాయుడు ఓటరు చుక్క కోసం చేసిన ప్రయత్నాలు ఆయనకు ఆకాశంలో చుక్కలు చూపెడుతున్నాయి అని రాజకీయ పరిశీలకులు, తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకులు అంటున్నారు.

పార్టీలో సీనియర్ నాయకులు అందరూ తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతుంటే…. పుండు మీద కారం చ‌ల్లిన‌ట్లుగా ఈ ఓటరు జాబితా రహస్యం బట్టబయలు కావడం చంద్రబాబు నాయుడికి, ఆయన కుమారుడు లోకేష్ కి నిద్ర ప‌ట్ట‌నివ్వ‌డం లేద‌ని తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News