ఏపీ ప్రజల డేటానే కాదు తెలంగాణ డేటా కూడా చోరీ చేశారు " స్టీఫెన్‌ రవీంద్ర

చట్టం ముందు అందరూ సమానమే అన్న విషయాన్ని అందరూ గుర్తించుకోవాలన్నారు ఏపీ డేటా కేసుపై ఏర్పాటైన సిట్‌కు నాయకత్వం వహిస్తున్న స్టీఫెన్ రవీంద్ర. ఏపీ ప్రజల డేటా మాత్రమే కాకుండా తెలంగాణకు సంబంధించిన డేటా కూడా టీడీపీకి చెందిన సేవామిత్రా యాప్‌ వద్ద ఉందన్నారు. తెలంగాణ డేటాతో వారు ఏం చేయాలనుకున్నారన్నది దర్యాప్తులో తేలుతుందన్నారు. టీడీపీకి చెందిన సేవామిత్రా యాప్‌లో పౌరుల వ్యక్తిగత డేటా ఉందన్నారు. నిందితుడు అశోక్ ఎక్కడున్నారన్నది ఇంకా తెలియరాలేదన్నారు. అశోక్‌ అమరావతిలో ఉన్నా, […]

Advertisement
Update:2019-03-07 12:48 IST

చట్టం ముందు అందరూ సమానమే అన్న విషయాన్ని అందరూ గుర్తించుకోవాలన్నారు ఏపీ డేటా కేసుపై ఏర్పాటైన సిట్‌కు నాయకత్వం వహిస్తున్న స్టీఫెన్ రవీంద్ర. ఏపీ ప్రజల డేటా మాత్రమే కాకుండా తెలంగాణకు సంబంధించిన డేటా కూడా టీడీపీకి చెందిన సేవామిత్రా యాప్‌ వద్ద ఉందన్నారు. తెలంగాణ డేటాతో వారు ఏం చేయాలనుకున్నారన్నది దర్యాప్తులో తేలుతుందన్నారు.

టీడీపీకి చెందిన సేవామిత్రా యాప్‌లో పౌరుల వ్యక్తిగత డేటా ఉందన్నారు. నిందితుడు అశోక్ ఎక్కడున్నారన్నది ఇంకా తెలియరాలేదన్నారు. అశోక్‌ అమరావతిలో ఉన్నా, అమెరికాలో ఉన్నా పట్టుకొస్తామన్నారు. ఎన్నికల కమిషన్‌కు కూడా లేఖలు రాశామన్నారు.

సేవా మిత్రాలో కలర్‌ ఫోటోల డేటాను కేసు నమోదు కాగానే వెంటనే తొలగించారన్నారు. ఇలా ఎందుకు చేశారన్నది కూడా దర్యాప్తు చేస్తున్నామన్నారు.

ప్రజల వ్యక్తిగత డేటా వీరి వద్దకు ఎలా వచ్చిందన్నది ఆరా తీస్తున్నట్టు చెప్పారు. డేటా ఎక్కడినుంచి వచ్చింది? ఎవరు ఇచ్చారు? అనేది తేలుస్తామన్నారు. ఈకేసు దర్యాప్తులో పురోగతి ఉందన్నారు. అమెజాన్, గూగుల్ నుంచి సమాచారం రావాల్సి ఉంది అన్నారు. రెండు మూడు రోజుల్లోనే ఈ కేసుకు సంబంధించిన కీలక వివరాలన్నీ వెల్లడిస్తామన్నారు.

Tags:    
Advertisement

Similar News