ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ తొలిరౌండ్లోనే సింధుకు షాక్

కొరియా ప్లేయర్ సుంగ్ జీ చేతిలో సింధు 3 గేమ్ ల ఓటమి 16-21, 22-20, 18-21తో సింధు పరాజయం 5వ సీడ్ గా టైటిల్ వేటకు దిగిన సింధుకు తప్పని నిరాశ 2019 ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ మహిళల సింగిల్స్ తొలిరౌండ్లోనే అతిపెద్ద సంచలనం నమోదయ్యింది. బర్మింగ్ హామ్ లో ప్రారంభమైన ఈ టోర్నీ తొలిరౌండ్లో హాట్ ఫేవరెట్ , 5వ సీడ్ పీవీ సింధు ఓటమి పాలయ్యింది. దక్షిణ కొరియా ప్లేయర్ సుంగ్ జీ హ్యున్ […]

Advertisement
Update:2019-03-07 02:30 IST
  • కొరియా ప్లేయర్ సుంగ్ జీ చేతిలో సింధు 3 గేమ్ ల ఓటమి
  • 16-21, 22-20, 18-21తో సింధు పరాజయం
  • 5వ సీడ్ గా టైటిల్ వేటకు దిగిన సింధుకు తప్పని నిరాశ

2019 ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ మహిళల సింగిల్స్ తొలిరౌండ్లోనే అతిపెద్ద సంచలనం నమోదయ్యింది. బర్మింగ్ హామ్ లో ప్రారంభమైన ఈ టోర్నీ తొలిరౌండ్లో హాట్ ఫేవరెట్ , 5వ సీడ్ పీవీ సింధు ఓటమి పాలయ్యింది.

దక్షిణ కొరియా ప్లేయర్ సుంగ్ జీ హ్యున్ మూడు గేమ్ ల పోరులో సింధును 21-16, 20-22, 21-18తో కంగు తినిపించింది.
52 నిముషాలపాటు సాగిన ఈ హోరాహోరీ సమరంలో సింధు అనూహ్యంగా ఇంటిదారి పట్టాల్సి వచ్చింది. సుంగ్ జీతో గతంలో మూడుసార్లు తలపడిన సింధు రెండు పరాజయాలు చవిచూడాల్సి వచ్చింది.

మ్యాచ్ ప్రారంభంలోనే ప్రత్యర్థికి భారీగా పాయింట్లు సమర్పించుకోడం తన ఓటమికి కారణమని…పైగా దురదృష్టం కూడా తనను వెంటాడిందని ఓటమి అనంతరం సింధు వాపోయింది.

Tags:    
Advertisement

Similar News