వన్డే క్రికెట్లో టీమిండియా 500వ విజయం

నాగపూర్ వన్డేలో ఆసీస్‌పై 8 పరుగులతో టీమిండియా గెలుపు డెత్ ఓవర్లలో చెలరేగిన బుమ్రా, విజయ్ శంకర్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 2-0తో పైచేయి వన్డే క్రికెట్ రెండో ర్యాంకర్ టీమిండియా ఓ అరుదైన ఘనత సంపాదించింది. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో 500 విజయాలు సాధించిన రెండో జట్టుగా రికార్డుల్లో చేరింది. నాగపూర్‌లోని విదర్భ క్రికెట్ సంఘం (వీసీఏ) స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో ముగిసిన రెండో వన్డేలో 8 పరుగుల తేడాతో విజయం సాధించడం ద్వారా […]

Advertisement
Update:2019-03-06 08:34 IST
  • నాగపూర్ వన్డేలో ఆసీస్‌పై 8 పరుగులతో టీమిండియా గెలుపు
  • డెత్ ఓవర్లలో చెలరేగిన బుమ్రా, విజయ్ శంకర్
  • ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 2-0తో పైచేయి

వన్డే క్రికెట్ రెండో ర్యాంకర్ టీమిండియా ఓ అరుదైన ఘనత సంపాదించింది. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో 500 విజయాలు సాధించిన రెండో జట్టుగా రికార్డుల్లో చేరింది. నాగపూర్‌లోని విదర్భ క్రికెట్ సంఘం (వీసీఏ) స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో ముగిసిన రెండో వన్డేలో 8 పరుగుల తేడాతో విజయం సాధించడం ద్వారా ఈ మైలురాయిని చేరింది.

ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో 251 పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో ఆస్ట్రేలియా విఫలమయ్యింది. కెప్టెన్ విరాట్ కొహ్లీ బ్యాటింగ్, ఆల్ రౌండర్ విజయ్ శంకర్ బౌలింగ్‌తో టీమిండియా
ఈ చిరస్మరణీయ విజయం సాధించింది.

558 విజయాలతో ఆసీస్ టాప్

వన్డే క్రికెట్ చరిత్రలో 558 విజయాలతో ఐదు సార్లు ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా అగ్రస్థానంలో నిలిస్తే, రెండు సార్లు ప్రపంచ కప్ అందుకున్న టీమిండియా 500 విజయాలతో రెండోస్థానంలో కొనసాగుతోంది.

ఆరెంజ్ సిటీలో ఓటమి లేని టీమిండియా

నాగపూర్ వీసీఏ స్టేడియం వేదికపై ఆస్ట్రేలియా ప్రత్యర్థిగా టీమిండియా ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ విజయాలు సాధించడం విశేషం. సిరీస్‌లోని మూడో వన్డే రాంచీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈనెల 8న జరుగుతుంది.

Tags:    
Advertisement

Similar News