మీరు మారరా..? మంత్రులపై బాబు సీరియస్..!

“మీకు ఎన్ని సార్లు చెప్పాలి. విపక్షాలు మన మీద దాడులు చేస్తున్నా మీరు మాత్రం పట్టించుకోవడం లేదు. ఎక్కడికక్కడ స్పందించాలని ఎన్నిసార్లు చెబుతున్నా మీరు శ్రద్ద పెట్టడం లేదు. అన్నింటికీ నేనొక్కడినే సమాధానం చెప్పుకోవాల్సి వస్తోంది. దీంతో విపక్షాలు ప్రతిరోజు విమర్శలు ఉధృతం చేస్తున్నాయి” అని చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గ సహచరుల పై మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మంగళవారం సాయంత్రం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో ఎన్నడూ లేనివిధంగా […]

Advertisement
Update:2019-03-06 05:03 IST

“మీకు ఎన్ని సార్లు చెప్పాలి. విపక్షాలు మన మీద దాడులు చేస్తున్నా మీరు మాత్రం పట్టించుకోవడం లేదు. ఎక్కడికక్కడ స్పందించాలని ఎన్నిసార్లు చెబుతున్నా మీరు శ్రద్ద పెట్టడం లేదు. అన్నింటికీ నేనొక్కడినే సమాధానం చెప్పుకోవాల్సి వస్తోంది. దీంతో విపక్షాలు ప్రతిరోజు విమర్శలు ఉధృతం చేస్తున్నాయి” అని చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గ సహచరుల పై మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మంగళవారం సాయంత్రం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో ఎన్నడూ లేనివిధంగా సీనియర్ మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ తనపై మూకుమ్మడి దాడులు చేస్తున్నా సీనియర్ మంత్రులు మాత్రం పెదవి విప్పకపోవడం దారుణమని చంద్రబాబు నాయుడు సీరియస్ అయినట్లు చెబుతున్నారు.

గడచిన రెండు నెలలుగా అనేకసార్లు చెప్తున్నా సీనియర్ మంత్రులు మాత్రం కదలిక రావడంలేదని, పార్టీలో తాను ఒక్కడినే మాట్లాడటం, వేరెవరూ స్పందించకపోవడంతో ప్రతిపక్ష వైసీపీ విమర్శలు తీవ్రతరం చేస్తోందని చంద్రబాబు అన్నట్లు సమాచారం. స్నేహ మిత్ర యాప్, ఐటీ గ్రిడ్స్ దాడులు వంటి అంశాలపై మంత్రులు ఎవరూ ప్రస్తావించలేదని.. ఇది లోకేష్ వ్యవహారం అని సీనియర్ మంత్రులు భావిస్తున్నారా అని చంద్రబాబు ప్రశ్నించినట్లు చెబుతున్నారు.

ప్రతిపక్షాలు దాడుల మీద దాడులు చేస్తుంటే మనం వాటిని తిప్పి కొట్టకపోతే ప్రజల్లో చులకన అయిపోతానని చంద్రబాబు వ్యాఖ్యానించినట్టు చెబుతున్నారు. “సీనియర్ మంత్రులు అంటే క్యాబినెట్‌లో కూర్చుని సలహాలు ఇవ్వడం కాదు. బయట జరుగుతున్న అనేక అంశాలపై స్పందించి పార్టీ వైఖరిని వివరించాల్సి ఉంటుంది” అని మంత్రివర్గ సహచరులకు హితవు పలికినట్లు చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News