ఎదురు చూస్తున్న వైసీపీ... ఆలస్యం టీడీపీ కోరిక
ఆంధ్రప్రదేశ్‌లో తీరా ఎన్నికల వేళ అనేక ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. డేటా సాయంతో ప్రత్యర్థి పార్టీ ఓట్లకు చెక్ పెట్టేందుకు ప్రయత్నించిన టీడీపీ తీరా ఎన్నికల వేళ అడ్డంగా దొరికిపోయింది. ఈ కేసును సైబరాబాద్ పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆధార్ డేటా, ఎలక్షన్ కమిషన్ డేటాను టీడీపీ చోరీ చేసిన నేపథ్యంలో ఆధార్ సంస్థ, ఎన్నికల సంఘం కూడా జోక్యం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ కేసు ఎంత దూరం వెళ్తుందో అర్థం కావడం లేదు. […]
Advertisement
ఆంధ్రప్రదేశ్‌లో తీరా ఎన్నికల వేళ అనేక ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. డేటా సాయంతో ప్రత్యర్థి పార్టీ ఓట్లకు చెక్ పెట్టేందుకు ప్రయత్నించిన టీడీపీ తీరా ఎన్నికల వేళ అడ్డంగా దొరికిపోయింది. ఈ కేసును సైబరాబాద్ పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
ఆధార్ డేటా, ఎలక్షన్ కమిషన్ డేటాను టీడీపీ చోరీ చేసిన నేపథ్యంలో ఆధార్ సంస్థ, ఎన్నికల సంఘం కూడా జోక్యం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ కేసు ఎంత దూరం వెళ్తుందో అర్థం కావడం లేదు. ప్రస్తుతం నిందితుడు అశోక్ తమ వద్దే ఉన్నారని టీడీపీ నాలెడ్జ్ సెంటర్ ఇన్‌చార్జ్ మల్యాద్రి స్వయంగా చెప్పారు. ప్రస్తుతం ఏపీ పోలీసు వ్యవస్థ మొత్తం తమ చేతుల్లో ఉంది కాబట్టి అశోక్‌ను తమ వద్దే పెట్టుకుని టీడీపీ నేతలు ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు. అయితే మరికొద్దిరోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. అదే జరిగితే ఏపీలో పోలీసు వ్యవస్థ కూడా ఎన్నికల కమిషన్ కిందకు వెళ్లిపోతుంది.
అప్పుడు చంద్రబాబుకు ఈ స్థాయిలో పోలీసులు సాయం అందించే అవకాశం లేదు. ఈసీ ఆదేశాల ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. రెండుమూడు రోజుల్లోనే షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండడంతో అదే జరిగితే టీడీపీకి పెద్ద ఇబ్బంది . డేటా ఆపరేషన్ మధ్యలో బెడిసికొట్టినందున దాన్ని పరిణామాలను టీడీపీ పెద్దలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. షెడ్యూల్ వచ్చిన తర్వాత ” నీకు ఏసీబీ ఉంది… నాకు ఏసీబీ ఉంది… నీకు పోలీసులున్నారు… నాకు పోలీసులున్నారు…. ” అని మాట్లాడే అవకాశం కూడా ఉండదు.
ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ మరికొద్దిరోజులు ఆలస్యం అయితే బాగుండు అని టీడీపీ నేతలు ఆశపడుతున్నారు. వైసీపీ వాళ్లు మాత్రం షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నారు.. ఓట్ల తొలగింపును అడ్డుకునేందుకు ప్రయత్నించినా సరే పోలీసుల సాయంతో చంద్రబాబు అణచివేస్తున్నారు. కానీ షెడ్యూల్ వస్తే పోలీసు వ్యవస్థపై చంద్రబాబు పట్టు ఉండదు. అప్పుడు వారు కూడా తటస్తంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. వైసీపీ దూకుడు పెంచేందుకు ఈ పరిణామం కూడా చాలా అవసరమని ఆ పార్టీ భావిస్తోంది. మొత్తం మీద ఏపీ ప్రజల వ్యక్తిగత డేటాను దొంగలించిన వ్యవహారంలో టీడీపీ… సొంత ప్రజల విశ్వసాన్నే దెబ్బతీసిందన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.
Advertisement