వన్డే క్రికెట్‌లో విరాట్ కొహ్లీ 40వ శతకం
నాగపూర్ వన్డేలో కొహ్లీ ఫైటింగ్ సెంచరీ అత్యంతవేగంగా 9 వేల పరుగుల క్లబ్‌లో రికీ పాంటింగ్ రికార్డును అధిగమించిన కొహ్లీ టీమిండియా రన్ మెషీన్ విరాట్ కొహ్లీ తన వన్డే కెరీర్లో సెంచరీల సంఖ్యను 40కి పెంచుకొన్నాడు. ఇవాళ నాగపూర్ విదర్భ క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో కొహ్లీ వీరోచిత సెంచరీ సాధించాడు. ఓ వైపు వికెట్లు కూలుతున్నా కొహ్లీ తనదైన శైలిలో బ్యాటింగ్ కొనసాగించి 107 బంతుల్లో మూడంకెల స్కోరు […]
- నాగపూర్ వన్డేలో కొహ్లీ ఫైటింగ్ సెంచరీ
- అత్యంతవేగంగా 9 వేల పరుగుల క్లబ్‌లో
- రికీ పాంటింగ్ రికార్డును అధిగమించిన కొహ్లీ
టీమిండియా రన్ మెషీన్ విరాట్ కొహ్లీ తన వన్డే కెరీర్లో సెంచరీల సంఖ్యను 40కి పెంచుకొన్నాడు. ఇవాళ నాగపూర్ విదర్భ క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో కొహ్లీ వీరోచిత సెంచరీ సాధించాడు. ఓ వైపు వికెట్లు కూలుతున్నా కొహ్లీ తనదైన శైలిలో బ్యాటింగ్ కొనసాగించి 107 బంతుల్లో మూడంకెల స్కోరు సాధించాడు.
అంతే కాకుండా ఇదే ఇన్నింగ్స్‌లో అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 9 వేల పరుగుల మైలురాయిని చేరిన కెప్టెన్‌గా సరికొత్త ఘనతను కొహ్లీ సొంతం చేసుకొన్నాడు. అంతకు మునుపు ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ పేరుతో ఉన్న ఈ రికార్డును విరాట్ కొహ్లీ తెరమరుగు చేశాడు.
పాంటింగ్ 203 ఇన్నింగ్స్‌లో 9వేల పరుగులు సాధిస్తే, విరాట్ కొహ్లీ మాత్రం 159 ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనతను సొంతం చేసుకోడం విశేషం. తన కెరియర్‌లో ప్రస్తుత నాగపూర్ వన్డే వరకూ 224 మ్యాచ్ లు ఆడిన కొహ్లీ… 40 సెంచరీలు, 49 హాఫ్ సెంచరీలతో సహా 10వేల 685 పరుగులకు పైగా సాధించాడు.