వన్డే మహిళా క్రికెట్లో భారత క్రికెటర్ల రికార్డు

బ్యాటింగ్‌లో స్మృతి మంథానా.. బౌలింగ్‌లో జులన్ గోస్వామి 218 వికెట్లతో జులన్ గోస్వామి టాప్ ర్యాంక్ 1873 రోజుల పాటు టాప్ ర్యాంక్‌లో జులన్ మహిళా వన్డే క్రికెట్‌లో భారత ఓపెనర్ స్మృతి మంథానా, బౌలర్ జులన్ గోస్పామి ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్‌లు సాధించారు. ఇంగ్లండ్‌తో ముగిసిన తీన్మార్ వన్డే సిరీస్‌ను భారత్ 2-1 ఆధిక్యంతో నెగ్గడంలో ప్రధాన పాత్ర వహించడం ద్వారా… ఈ ఇద్దరూ టాప్ ర్యాంకుల్లో నిలిచారు. భారత బ్యాటింగ్ యువ సంచలనం […]

Advertisement
Update:2019-03-05 09:53 IST
  • బ్యాటింగ్‌లో స్మృతి మంథానా.. బౌలింగ్‌లో జులన్ గోస్వామి
  • 218 వికెట్లతో జులన్ గోస్వామి టాప్ ర్యాంక్
  • 1873 రోజుల పాటు టాప్ ర్యాంక్‌లో జులన్

మహిళా వన్డే క్రికెట్‌లో భారత ఓపెనర్ స్మృతి మంథానా, బౌలర్ జులన్ గోస్పామి ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్‌లు సాధించారు. ఇంగ్లండ్‌తో ముగిసిన తీన్మార్ వన్డే సిరీస్‌ను భారత్ 2-1 ఆధిక్యంతో నెగ్గడంలో
ప్రధాన పాత్ర వహించడం ద్వారా… ఈ ఇద్దరూ టాప్ ర్యాంకుల్లో నిలిచారు.

భారత బ్యాటింగ్ యువ సంచలనం స్మృతి మంథానా… మొత్తం 797 ర్యాంకింగ్ పాయింట్లతో టాప్ ర్యాంక్ అందుకుంది. మరోవైపు… భారత జట్టుకు గత దశాబ్దకాలంగా అరుదైన సేవలు అందిస్తూ వచ్చిన వెటరన్ ఫాస్ట్ బౌలర్ జులన్ గోస్వామి.. మరోసారి టాప్ ర్యాంక్ సాధించింది. ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో ఏడు వికెట్లు సాధించడం ద్వారా వన్డే క్రికెట్లో తన వికెట్ల సంఖ్యను 218కు పెంచుకోగలిగింది.

1873 రోజుల పాటు నంబర్ వన్‌గా జులన్

బెంగాల్ నుంచి భారత క్రికెట్లోకి దూసుకొచ్చిన 36 ఏళ్ల జులన్ గోస్వామి రెండేళ్ల క్రితం టాప్ ర్యాంక్‌ను… ఆస్ట్రేలియా బౌలర్ మేగాన్ షుట్‌కు కోల్పోయింది. ఆ తర్వాత తిరిగి ప్రస్తుత సిరీస్ ద్వారా టాప్ ర్యాంక్ మరోసారి అందుకోగలిగింది.

ప్రపంచ నంబర్ వన్ బౌలర్ ర్యాంక్‌ను 1873 రోజులపాటు నిలుపుకొన్న ఒకే ఒక్క భారత బౌలర్ జులన్ గోస్వామి మాత్రమే. తన కెరియర్‌లో ఇప్పటి వరకూ 177 వన్డేలు ఆడిన జులన్ 218 వికెట్లు సంపాదించింది.

2012లో మిథాలీ.. 2019లో స్మృతి

2012లో మిథాలీరాజ్, జులన్ గోస్వామి బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో టాప్ ర్యాంక్‌లు సాధించగా, ఏడేళ్ల విరామం తర్వాత స్మృతి మంథానా, జులన్ గోస్వామి తిరిగి అదే ఘనత సాధించడం విశేషం. ఇది భారత మహిళా క్రికెట్‌కే గర్వకారణంగా మిగిలిపోతుంది.

మొత్తం మీద బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో ఇద్దరు భారత క్రికెటర్లు ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్‌లు సాధించడం ఇటీవలి కాలంలో ఇదే ప్రథమం.

Tags:    
Advertisement

Similar News