స్పీకర్ కోడెల నీతిబోధ
మూడున్నర కోట్ల మంది ఏపీ ప్రజల వ్యక్తిగత డేటాను బజారులో పెట్టిన టీడీపీ… ఇప్పుడు ఎదురుదాడి తీవ్రతరం చేసింది. ఈ అంశాన్ని ఆంధ్రా, తెలంగాణ వివాదంగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. డేటా దొంగతనంపై స్పందించడం కంటే… టీఆర్‌ఎస్, వైసీపీ అంటూ విమర్శలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కూడా స్పందించారు. డేటా దొంగతనం అంటుంటే విచిత్రంగా ఉందన్నారు. దొంగతనం చేసిన వాడే దొంగ అని అరుస్తున్నట్టుగా ఉందన్నారు. ఏపీలో కులతత్వాన్ని రెచ్చగొట్టడం ఏమిటని […]
మూడున్నర కోట్ల మంది ఏపీ ప్రజల వ్యక్తిగత డేటాను బజారులో పెట్టిన టీడీపీ… ఇప్పుడు ఎదురుదాడి తీవ్రతరం చేసింది. ఈ అంశాన్ని ఆంధ్రా, తెలంగాణ వివాదంగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. డేటా దొంగతనంపై స్పందించడం కంటే… టీఆర్‌ఎస్, వైసీపీ అంటూ విమర్శలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కూడా స్పందించారు.
డేటా దొంగతనం అంటుంటే విచిత్రంగా ఉందన్నారు. దొంగతనం చేసిన వాడే దొంగ అని అరుస్తున్నట్టుగా ఉందన్నారు. ఏపీలో కులతత్వాన్ని రెచ్చగొట్టడం ఏమిటని ప్రశ్నించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
స్పీకర్‌గా తాను ఆ స్థానం గౌరవాన్ని నిలబెడుతూనే టీడీపీ కోసం పనిచేస్తానని స్పీకర్ కోడెల చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తన స్థానంలోనే కాకుండా మిగిలిన స్థానాల్లోనూ టీడీపీని గెలిపించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. ఒకే కుటుంబంలో ఉంటూ ఒకరు బీజేపీలో , మరొకరు వైసీపీలో ఉండడం ఏమిటని పరోక్షంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుటుంబాన్ని కోడెల శివప్రసాదరావు ప్రశ్నించారు.
ఏపీ వారికి సంబంధించిన డేటాపై తెలంగాణ పోలీసులు ఓవరాక్షన్ ఏమిటని ప్రశ్నించారు. ఈ అంశానికి వైసీపీకి సంబంధం ఏమిటని కోడెల నిలదీశారు. హైదరాబాద్ పదేళ్ల ఉమ్మడి రాజధాని అని … హైదరాబాద్‌పై తమకూ హక్కు ఉందని చెప్పారు. సమాజం పట్ల బాధ్యతతో ఉండాలని కోడెల సూచించారు.