ఎన్నికల సంఘం... వీటికి సమాధానం ఏది!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. ప్రజల వద్దకు వెళ్లి వారి మనసు గెలిచి ఓట్లు వేయించుకునే పంథాకు కొన్ని పార్టీలు గుడ్‌బై చెప్పేశారు. సింపుల్‌గా ప్రజల వ్యక్తిగత డేటాను దగ్గరపెట్టుకుని వ్యతిరేకుల ఓట్లు తీసేసి అధికారంలోనే తిష్టవేసే నీచ రాజకీయం మొదలైంది. అయితే ఇంత జరుగుతున్నా ఎన్నికల కమిషన్ స్పందన నామమాత్రంగానే ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. తన ఓటు తొలగించాలని జనం దరఖాస్తు చేయడం అన్నది దాదాపు జరగదు. చచ్చినప్పుడు మాత్రం ఓటు పోతుంది. అలాంటిది లక్షాలదిగా […]

Advertisement
Update:2019-03-05 02:41 IST

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. ప్రజల వద్దకు వెళ్లి వారి మనసు గెలిచి ఓట్లు వేయించుకునే పంథాకు కొన్ని పార్టీలు గుడ్‌బై చెప్పేశారు. సింపుల్‌గా ప్రజల వ్యక్తిగత డేటాను దగ్గరపెట్టుకుని వ్యతిరేకుల ఓట్లు తీసేసి అధికారంలోనే తిష్టవేసే నీచ రాజకీయం మొదలైంది.

అయితే ఇంత జరుగుతున్నా ఎన్నికల కమిషన్ స్పందన నామమాత్రంగానే ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. తన ఓటు తొలగించాలని జనం దరఖాస్తు చేయడం అన్నది దాదాపు జరగదు. చచ్చినప్పుడు మాత్రం ఓటు పోతుంది. అలాంటిది లక్షాలదిగా ఓట్ల తొలగింపుకు దరఖాస్తులు వస్తున్నాయంటే ఇది ముమ్మాటికి కుంభకోణమే అని సామాన్యులకు కూడా అర్థమైపోతోంది. అయినా సరే ఈసీ మాత్రం ఇంకా సాంకేతిక అంశాలనే పట్టుకుని వేలాడుతోంది.

అసలు ఆన్‌లైన్‌లో ఓట్ల తొలగింపుకు అవకాశం ఇవ్వడమే ఇప్పుడు కుంభకోణానికి వీలు కల్పిస్తోంది. పది రోజుల్లోనే ఏడు లక్షల దరఖాస్తులు ఓట్ల తొలగింపుకు వచ్చాయని స్వయంగా ఎన్నికల కమిషనే చెబుతోంది. డేటా చోరీ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత అప్రమత్తమయ్యాయని ఈసీ చెబుతోంది. ఆన్‌ లైన్‌లో వచ్చిన దరఖాస్తులను పూర్తిగా పరిశీలిస్తామని చెబుతోంది.

కానీ ఈ ఓట్ల తొలగింపు వ్యవహారం గత ఆరు నెలల నుంచే సాగుతోంది. ఇప్పటికే లక్షలాది ఓట్లు గల్లంతు అయ్యాయి. మరీ వీటి సంగతి ఏమిటన్నది ఇప్పుడు ప్రజల ప్రశ్న. దీనిపై మాత్రం ఈసీ స్పందించకపోవడం, కేవలం తిరిగి దరఖాస్తు చేసుకోండి అని చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. చదువురాని వారు, వృద్దులు, ఓట్లు ఆన్‌లైన్‌లో సరిచూసుకోలేని వారికి ఇప్పటికీ తమ ఓటు ఉందో లేదో తెలియదు. ఈనేపథ్యంలో ఈసీ నామమాత్రపు స్పందన ఆందోళన కలిగిస్తోంది. అసలు ఇప్పటికే ఫారం-7 ద్వారా తొలగించబడ్డ ఓట్ల విషయంలో ఈసీ తన వైఖరిని స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది.

Advertisement

Similar News