చేతులెత్తేసిన మురళీమోహన్

నటుడు మురళీమోహన్ చేతులెత్తేశారు. గత ఎన్నికల్లో రాజమండ్రి ఎంపీగా గెలిచిన ఆయన ఈసారి పోటీ నుంచి తప్పుకుంటున్నారు. ఈ విషయాన్ని నేరుగా చంద్రబాబుకే చెప్పేందుకు సిద్ధమయ్యారు. మురళీమోహన్ కాకపోతే ఆయన  కోడలు రూప బరిలో దిగుతారన్న ప్రచారం సాగింది. అయితే ఆయన కోడలు కూడా ఈసారి పోటీ చేసేందుకు సిద్ధంగా లేరు. ఈ విషయాన్ని చంద్రబాబుకు వివరించనున్నారు మురళీమోహన్. శుక్రవారం రాజమండ్రి పార్లమెంట్‌, దాని పరిధిలోని అసెంబ్లీ స్థానాలపై చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి హాజరవుతున్న మురళీ మోహన్ తాను గానీ, తన కోడలు గానీ […]

Advertisement
Update:2019-03-01 06:24 IST

నటుడు మురళీమోహన్ చేతులెత్తేశారు. గత ఎన్నికల్లో రాజమండ్రి ఎంపీగా గెలిచిన ఆయన ఈసారి పోటీ నుంచి తప్పుకుంటున్నారు. ఈ విషయాన్ని నేరుగా చంద్రబాబుకే చెప్పేందుకు సిద్ధమయ్యారు. మురళీమోహన్ కాకపోతే ఆయన కోడలు రూప బరిలో దిగుతారన్న ప్రచారం సాగింది.

అయితే ఆయన కోడలు కూడా ఈసారి పోటీ చేసేందుకు సిద్ధంగా లేరు. ఈ విషయాన్ని చంద్రబాబుకు వివరించనున్నారు మురళీమోహన్. శుక్రవారం రాజమండ్రి పార్లమెంట్‌, దాని పరిధిలోని అసెంబ్లీ స్థానాలపై చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి హాజరవుతున్న మురళీ మోహన్ తాను గానీ, తన కోడలు గానీ పోటీకి సిద్ధంగా లేమని వివరించనున్నారు.

మరొకరిని పోటీకి చూసుకోవాల్సిందిగా చంద్రబాబుకు స్పష్టం చేయనున్నారు. ఇకపై రాజకీయ వేదిక నుంచి కాకుండా ట్రస్ట్‌ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తానని మురళీమోహన్ చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News