పారిశుధ్య కార్మికుల కాళ్లు కడగటంపై మోడీ వివరణ
ఇటీవల కుంభమేళాలో పారిశుధ్య కార్మికులుగా విధులు నిర్వర్తించిన వారి కాళ్లు ప్రధాని నరేంద్ర మోడీ కడిగి దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశారు. ప్రధాని చేసిన పనిని ఎంతో మంది అభినందించగా.. చాలా మంది విమర్శలు కూడా చేశారు. ఎన్నికల ముందు ఓట్ల కోసమే ప్రధాని పారిశుధ్య కార్మికుల కాళ్లు కడిగారని.. ఇది కేవలం గిమ్మిక్కే అని ప్రధాని మోడీపై విమర్శలు సంధించారు. ఇవాళ బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పూణేకు చెందిన ఒక […]
ఇటీవల కుంభమేళాలో పారిశుధ్య కార్మికులుగా విధులు నిర్వర్తించిన వారి కాళ్లు ప్రధాని నరేంద్ర మోడీ కడిగి దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశారు. ప్రధాని చేసిన పనిని ఎంతో మంది అభినందించగా.. చాలా మంది విమర్శలు కూడా చేశారు.
ఎన్నికల ముందు ఓట్ల కోసమే ప్రధాని పారిశుధ్య కార్మికుల కాళ్లు కడిగారని.. ఇది కేవలం గిమ్మిక్కే అని ప్రధాని మోడీపై విమర్శలు సంధించారు. ఇవాళ బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పూణేకు చెందిన ఒక కార్పొరేటర్ కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. ‘మీరు ఎన్నికల్లో ఓట్ల కోసమే పారిశుధ్య కార్మికుల కాళ్లు కడిగారని విమర్శలు వస్తున్నాయి.. దీనిపై మీరేమంటారు’ అని నేరుగా మోడీని ప్రశ్నించాడు.
ఆ కార్పొరేటర్ ప్రశ్నకు ప్రధాని బదులిస్తూ.. తనకు కొన్ని విలువలు ఉన్నాయని.. ఆ కారణంగానే పారిశుధ్య కార్మికులు కాళ్లు కడిగాను తప్పా ఎన్నికల గిమ్మిక్కు.. ఓట్ల రాజకీయం కాదని మోడీ స్పష్టం చేశారు. ఇంకా ఏమన్నారంటే.. కోట్లాది మంది పాల్గొన్న కుంభమేళకు నేను కూడా వెళ్లాను, 22 కోట్ల మంది కుంభమేళకు హాజరైనా అక్కడి పరిసరాలు మాత్రం చాలా పరిశుభ్రంగా ఉన్నాయి. దానికి కారణం పారిశుధ్య కార్మికులు చేసిన శ్రమే. అందుకే వారి కాళ్లు కడిగి నా కృతజ్ఞత తెలియజేయాలని ఆనాడే నిర్ణయించుకున్నాను… అంటూ బదులిచ్చారు.