భారత గడ్డపై ఆస్ట్రేలియా అరుదైన విజయం

టీ-20 సిరీస్ లో టీమిండియాకు కంగారూ షాక్ టీమిండియా పై తొలిసారిగా టీ-20 సిరీస్ నెగ్గిన ఆసీస్ స్వదేశంలో కెప్టెన్ గా విరాట్ కొహ్లీకి తొలి సిరీస్ ఓటమి మహేంద్రసింగ్ ధోనీ 350 సిక్సర్ల రికార్డు టీ-20 క్రికెట్ రెండోర్యాంకర్ టీమిండియాకు…ఐదోర్యాంకర్ ఆస్ట్రేలియా…ఊహించని దెబ్బ కొట్టింది. రెండుమ్యాచ్ ల టీ-20 సిరీస్ ను 2-0తో గెలుచుకొని…దెబ్బకు దెబ్బ తీసింది. ఇటీవలే ముగిసిన ఆస్ట్రేలియా పర్యటనలో టీ-20 సిరీస్ ను 1-1తో డ్రాగా ముగించిన విరాట్ సేనకు… స్వదేశంలో జరిగిన టీ-20 […]

Advertisement
Update:2019-02-28 15:20 IST
  • టీ-20 సిరీస్ లో టీమిండియాకు కంగారూ షాక్
  • టీమిండియా పై తొలిసారిగా టీ-20 సిరీస్ నెగ్గిన ఆసీస్
  • స్వదేశంలో కెప్టెన్ గా విరాట్ కొహ్లీకి తొలి సిరీస్ ఓటమి
  • మహేంద్రసింగ్ ధోనీ 350 సిక్సర్ల రికార్డు

టీ-20 క్రికెట్ రెండోర్యాంకర్ టీమిండియాకు…ఐదోర్యాంకర్ ఆస్ట్రేలియా…ఊహించని దెబ్బ కొట్టింది. రెండుమ్యాచ్ ల టీ-20 సిరీస్ ను 2-0తో గెలుచుకొని…దెబ్బకు దెబ్బ తీసింది. ఇటీవలే ముగిసిన ఆస్ట్రేలియా పర్యటనలో టీ-20 సిరీస్ ను 1-1తో డ్రాగా ముగించిన విరాట్ సేనకు… స్వదేశంలో జరిగిన టీ-20 సిరీస్ లో మాత్రం పరాజయం తప్పలేదు.

ఇక…కెప్టెన్ గా విరాట్ కొహ్లీకి స్వదేశంలో ఇదే తొలి సిరీస్ ఓటమి కావడం మరో విశేషం. కొహ్లీ కెప్టెన్సీలో టీమిండియా … మొత్తం మూడు ఫార్మాట్లలో ఆడిన 16 సిరీస్ ల్లో 14 విజయాలు, ఓ డ్రా, ఓ ఓటమి రికార్డుతో నిలిచింది. భారత్ ప్రత్యర్థిగా టీ-20 క్రికెట్లో ఆస్ట్రేలియాకు ఇదే తొలి సిరీస్ విజయం కావటం విశేషం.

మాక్స్ వెల్ ధనాధన్ సెంచరీ….

టీమిండియాతో రెండుమ్యాచ్ ల టీ-20 సిరీస్ లో కంగారూ సూపర్ హిట్టర్ గ్లెన్ మాక్స్ వెల్ ఓ అరుదైన రికార్డు సాధించాడు.

చిన్నస్వామి స్టేడియం వేదికగా ముగిసిన రెండో టీ-20 మ్యాచ్ లో…మాక్స్ వెల్ కేవలం 55 బాల్స్ లోనే 7 బౌండ్రీలు, 9 సిక్సర్లతో 113 పరుగుల నాటౌట్ స్కోరు సాధించడం ద్వారా…ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకొన్నాడు.

అంతేకాదు…టీ-20 చేజింగ్ లో..రెండు సెంచరీలు బాదిన ఏకైక, తొలి బ్యాట్స మన్ గా మాక్స్ వెల్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

దిల్షాన్ బౌండ్రీల రికార్డు కొహ్లీ సమం…

ఆస్ట్రేలియాతో ముగిసిన రెండో టీ-20 మ్యాచ్ లో…టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ ఓ అరుదైన రికార్డు నమోదు చేశాడు. తన కెరియర్ లోనే ఓ సింగిల్ టీ-20 మ్యాచ్ లో…అత్యధిక సిక్సర్లు బాదాడు. కొహ్లీ ఆరుసిక్సర్లు, 2 బౌండ్రీలతో అజేయ హాఫ్ సెంచరీ సాధించాడు.

అంతేకాదు…ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో అత్యధిక బౌండ్రీలు బాదిన దిల్షాన్ 223 బౌండ్రీల రికార్డును …కొహ్లీ సమం చేశాడు. దిల్షాన్ 80 ఇన్నింగ్స్ లో 223 బౌండ్రీలు బాదితే…విరాట్ కొహ్లీ మాత్రం…కేవలం 67 ఇన్నింగ్స్ లోనే 223 బౌండ్రీల రికార్డును చేరాడు.

సిక్సర్ల మొనగాడు ధోనీ….

టీమిండియా ఎవర్ గ్రీన్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మహేంద్రసింగ్ ధోనీ….సిక్సర్ల బాదుడులో తనకు తానే సాటిగా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్లో 350 సిక్సర్లు బాదిన భారత తొలి క్రికెటర్ గా రికార్డుల్లో చేరాడు. రెండుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా …బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ముగిసిన ఆస్ట్రేలియాతో ముగిసిన రెండో టీ-20 మ్యాచ్ లో ధోనీ కేవలం 23 బాల్స్ లోనే 3 బౌండ్రీలు, 3 సిక్సర్లతో 40 పరుగుల స్కోరు సాధించడం ద్వారా… తన కెరియర్ లో 350 సిక్సర్ల మైలురాయిని చేరాడు.

క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ కలిపి ధోనీ ఈ రికార్డు నమోదు చేశాడు. టెస్ట్ క్రికెట్లో 78 సిక్సర్లు బాదిన ధోనీ…వన్డే క్రికెట్లో 222 సిక్సర్లు, టీ-20 మ్యాచ్ ల్లో 52 సిక్సర్లు బాదాడు. 350 సిక్సర్లు సాధించిన భారత తొలి, ఏకైక క్రికెటర్ గా రికార్డుల్లో చేరాడు.

Tags:    
Advertisement

Similar News