భారత్‌- పాక్ యుద్ధ వాతావరణంపై చంద్రబాబు స్పందన

భారత్‌- పాక్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఢిల్లీలో జరిగిన విపక్షాల భేటీకి చంద్రబాబు హాజరయ్యారు. సమావేశం అనంతరం చంద్రబాబు తెలుగు మీడియాతో తెలుగులో మాట్లాడారు. సైన్యానికి తాము సంఘీభావం తెలుపుతున్నామన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులను అధికార పార్టీ రాజకీయాల కోసం ఉపయోగించుకోకూడదని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని తాము చాలా స్పష్టంగా చెబుతున్నామన్నారు. ప్రస్తుత పరిస్థితిలో అన్ని పార్టీలను పరిగణనలోకి తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. భారత పైలట్‌ బంధీగా దొరికిన అంశంపైనా సమావేశంలో చర్చించామన్నారు. […]

Advertisement
Update:2019-02-27 06:38 IST

భారత్‌- పాక్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఢిల్లీలో జరిగిన విపక్షాల భేటీకి చంద్రబాబు హాజరయ్యారు. సమావేశం అనంతరం చంద్రబాబు తెలుగు మీడియాతో తెలుగులో మాట్లాడారు.

సైన్యానికి తాము సంఘీభావం తెలుపుతున్నామన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులను అధికార పార్టీ రాజకీయాల కోసం ఉపయోగించుకోకూడదని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని తాము చాలా స్పష్టంగా చెబుతున్నామన్నారు.

ప్రస్తుత పరిస్థితిలో అన్ని పార్టీలను పరిగణనలోకి తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. భారత పైలట్‌ బంధీగా దొరికిన అంశంపైనా సమావేశంలో చర్చించామన్నారు. అతడిని విడిపించుకురావాల్సిన అవసరం ఉందన్నారు. పాక్ కవ్వింపు చర్యలను ఖండిస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు.

Tags:    
Advertisement

Similar News