బాబుకు తప్పని "కుటుంబ" తలపోట్లు!

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కుటుంబ తలపోట్లు తప్పడం లేదు. అంటే ఆయన కుటుంబ తలపోట్లు కాదు… పార్టీలో కొందరు నాయకులు తమ కుటుంబాల తలనొప్పులను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి తగిలిస్తున్నారంటున్నారు. ఇవి రోజు రోజుకు పెరుగుతున్నాయని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ కొత్త తలనొప్పులకు తలవంచక తప్పదని కొందరు నాయకులు చెబుతున్నారు. ఇంతకీ టిక్కెట్ల ఇక్కట్లు […]

Advertisement
Update:2019-02-27 09:24 IST

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కుటుంబ తలపోట్లు తప్పడం లేదు. అంటే ఆయన కుటుంబ తలపోట్లు కాదు… పార్టీలో కొందరు నాయకులు తమ కుటుంబాల తలనొప్పులను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి తగిలిస్తున్నారంటున్నారు. ఇవి రోజు రోజుకు పెరుగుతున్నాయని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ కొత్త తలనొప్పులకు తలవంచక తప్పదని కొందరు నాయకులు చెబుతున్నారు.

ఇంతకీ టిక్కెట్ల ఇక్కట్లు ఎవరి నుంచి వస్తున్నాయనుకుంటున్నారా.. ఇంకెవరు రాయలసీమ జిల్లాలకు చెందిన సీనియర్ నాయకుల నుంచే ఎక్కువగా ఉన్నాయంటున్నారు. తాజాగా ఈ కుటుంబ టిక్కెట్ల వ్యవహారంలోకి శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం నాయకులు కూడా చేరారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు జే.సీ.దివాకర్ రెడ్డి ఈ కుటుంబ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. ఆయన తన కుమారుడు పవన్ కుమార్ రెడ్డికి ముందుగా అనంతపురం ఎంపీ స్ధానం కావాలని పట్టుపట్టారు. అక్కడ పరిస్ధితులు సరిగా లేవని తెలుసుకున్న ఆయన ఇప్పుడు ఎంపీ వద్దు…ఎమ్మెల్యే ముద్దు అంటూ చంద్రబాబు నాయుడ్ని ఇరుకున పెట్టే పని ప్రారంభించారు. జిల్లాల్లో సిట్టింగులకు చెప్పుకోలేక.. లోపల దాచుకోలేక చంద్రబాబు నాయుడు సతమతమవుతున్నారు.

ఇక కర్నూలు జిల్లాలో అయితే మరీ దారుణం. పార్టీ నాయకుడు టీ.జీ.వెంకటేష్ తన కుమారుడికే కర్నూలు టిక్కెట్ అంటూ ప్రచారం కూడా ప్రారంభించేశారు. దీంతో అక్కడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఏం పాలుపోవడం లేదు. గతంలో ఇక్కడ సిట్టింగులకే టిక్కెట్ ఇస్తామంటూ చినబాబు నారా లోకేష్ ప్రకటించారు. ఇదొక కొత్త తలపోటులా పరిణమించింది.

అదే జిల్లాకు చెందిన కెఈ కుటుంబం కూడా గుత్తగా నాలుగు స్ధానాలు కోరుతోంది. వారికే అన్ని టిక్కెట్లు ఇస్తే ఇక జిల్లాలో మిగిలిన వారి పరిస్థితి ఏమిటని నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇదే జిల్లాలో కొత్తగా టీడీపీలో చేరబోతున్న కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కూడా మూడు సీట్లు అడుగుతున్నాడు.

ఉత్తరాంధ్ర జిల్లాలో కీలకమైన శ్రీకాకుళంలోనూ అదే పరిస్థితి. దివంగత నేత కింజారపు ఎర్రంనాయుడి కుటుంబం ఏకంగా కొడుకు, కూతురు, అల్లుడు, వియ్యంకుడికి కూడా టిక్కెట్లు అడుగుతోంది. ఇక మంత్రి అచ్చెన్నాయుడు అయితే శ్రీకాకుళం పార్లమెంట్ స్ధానం నుంచి పోటీ చేస్తారని ఆయన వదిన, ఎర్రంనాయుడి భార్య పార్టీ అధినేత వద్ద అల్టిమేటం ఇచ్చినట్లు చెబుతున్నారు. మీ కుటుంబానికే కాకుండా ఎక్కడో రెండు జిల్లాల అవతల ఉన్న మీ వియ్యంకుడికి కూడా టిక్కెట్ ఇవ్వమంటే ఎలా అంటూ చంద్రబాబు నాయుడు కాసింత అసహనం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.

మొత్తం మీద చంద్రబాబు నాయుడికి కుటుంబాలకు కుటుంబాలు టిక్కెట్లు కావాలని అడుగుతూ ఇక్కట్ల పాలు చేస్తున్నారని పార్టీ నాయకులు అంటున్నారు.

Tags:    
Advertisement

Similar News