అన్నదాతల ఉసురు ఏపీ ప్రభుత్వానికి తగులుతుంది " రేణుదేశాయ్

ఏపీ ప్రభుత్వ తీరుపై సామాజికవేత్త, నటి రేణుదేశాయ్ తీవ్రంగా స్పందించారు. కర్నూలు జిల్లాలో రైతుల పరిస్థితిపై అధ్యయనం చేసేందుకు పర్యటిస్తున్న ఆమె పలువురు రైతు కుటుంబాలను కలిశారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆలూరు మండలం తుంబళబీడు గ్రామంలో గతేడాది రైతు దంపతులు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఆత్మహత్య చేసుకున్న బోయ రామయ్య, వండ్రమ్మ రైతు దంపతుల పిల్లలను రేణుదేశాయ్ కలిశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, ఇతర రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. కరువు వల్ల తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. […]

Advertisement
Update:2019-02-26 01:44 IST

ఏపీ ప్రభుత్వ తీరుపై సామాజికవేత్త, నటి రేణుదేశాయ్ తీవ్రంగా స్పందించారు. కర్నూలు జిల్లాలో రైతుల పరిస్థితిపై అధ్యయనం చేసేందుకు పర్యటిస్తున్న ఆమె పలువురు రైతు కుటుంబాలను కలిశారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆలూరు మండలం తుంబళబీడు గ్రామంలో గతేడాది రైతు దంపతులు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఆత్మహత్య చేసుకున్న బోయ రామయ్య, వండ్రమ్మ రైతు దంపతుల పిల్లలను రేణుదేశాయ్ కలిశారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు, ఇతర రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. కరువు వల్ల తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. తుంబళబీడు గ్రామస్తులు తమ గ్రామంలో కనీసం తాగునీరు కూడా లేవని వివరించారు. గ్రామంలో పాడైపోయిన రోడ్లను చూపించారు.

పంటలు పండకపోవడంతో బ్యాంకుల్లో తెచ్చుకున్న అప్పులు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నామన్నారు. గిట్టుబాటు ధర కూడా దక్కడం లేదని.. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా న్యాయం జరగడం లేదన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు దంపతులకు చెందిన పిల్లల కష్టాలు చూసి రేణుదేశాయ్ కంటతడి పెట్టుకున్నారు.

రైతుల పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా, వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఈ రైతు కుటుంబాల ఉసురు రాష్ట్ర ప్రభుత్వానికి తగిలి తీరుతుందన్నారు రేణుదేశాయ్.

Tags:    
Advertisement

Similar News