భారత యుద్ద విమానాలు ప్రవేశించినట్లు 'ఫ్లైట్ డేటా'
నియంత్రణ రేఖను దాటి భారత యుద్ద విమానాలు పాకిస్తాన్ గగనతలంలోనికి ప్రవేశించినట్లు పలు ఆధారాలు లభిస్తున్నాయి. కమర్షియల్ ‘ఫ్లైట్ డేటా’ను ట్రాక్ చేసే పలు వెబ్‌సైట్లలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఐఎల్-78 విమానాలు ఆ ప్రాంతంలో సంచరించినట్లు వెల్లడైంది. పాకిస్తాన్ గగనతలంపై దాదాపు 12 యుద్ద విమానాలు దాదాపు 21 నిమిషాలు సంచరించినట్లు డేటా నమోదైంది. పాకిస్తాన్‌కు చెందిన ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్ కూడా భారత యుద్ద విమానాలు పాక్ గగనతలంలో దాడులు చేసినట్లు […]
నియంత్రణ రేఖను దాటి భారత యుద్ద విమానాలు పాకిస్తాన్ గగనతలంలోనికి ప్రవేశించినట్లు పలు ఆధారాలు లభిస్తున్నాయి. కమర్షియల్ ‘ఫ్లైట్ డేటా’ను ట్రాక్ చేసే పలు వెబ్‌సైట్లలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఐఎల్-78 విమానాలు ఆ ప్రాంతంలో సంచరించినట్లు వెల్లడైంది. పాకిస్తాన్ గగనతలంపై దాదాపు 12 యుద్ద విమానాలు దాదాపు 21 నిమిషాలు సంచరించినట్లు డేటా నమోదైంది.
పాకిస్తాన్‌కు చెందిన ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్ కూడా భారత యుద్ద విమానాలు పాక్ గగనతలంలో దాడులు చేసినట్లు ధృవీకరించింది. భారత వాయుసేన ధృవీకరించడానికి ముందే పాకిస్తాన్ దాడులను ధృవీకరించడం గమనార్హం. మరోవైపు భారత్‌కు చెందిన మిరాజ్ యుద్ద విమానాలను పాకిస్తాన్ విమానాలు వెంటాడినట్లు వార్తలు వస్తున్నాయి. కాని దానికి సంబంధించిన ఎలాంటి ఫ్లైట్ డేటా బయటపడలేదు.
మరోవైపు భారత వాయుసేన పాకిస్తాన్‌లోని బాల్కోట్ వద్ద వెయ్యి కిలోల బాంబు జారవిడిచినట్లు చెబుతూ కొన్ని ఫొటోలను ఐఎస్‌పీఆర్ విడుదల చేసింది. కాని అవి ఆ ప్రాంతం మొత్తం కవర్ చేస్తూ లేకపోవడం విశేషం.