పోటీ వద్దు... ప్రచారం చేస్తాం : ఏపీ కమలనాథులు

రానున్న ఎన్నికలలో శాసనసభ స్థానాలకు కానీ, లోక్ సభ స్థానాలకు నుంచి కానీ ఈసారి తాము పోటీ చేయమని సిట్టింగ్ ఎంపీలు, శాసనసభ్యులు భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వానికి స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పరిస్థితి దారుణంగా ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో పోటీ చేసి విజయం సాధించడం అనేది అసాధ్యం అని భారతీయ జనతా పార్టీ అధిష్టానానికి ఆంధ్రప్రదేశ్ నాయకులు స్పష్టం చేసినట్లు సమాచారం. గడచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు కారణంగా […]

Advertisement
Update:2019-02-25 08:45 IST

రానున్న ఎన్నికలలో శాసనసభ స్థానాలకు కానీ, లోక్ సభ స్థానాలకు నుంచి కానీ ఈసారి తాము పోటీ చేయమని సిట్టింగ్ ఎంపీలు, శాసనసభ్యులు భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వానికి స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పరిస్థితి దారుణంగా ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో పోటీ చేసి విజయం సాధించడం అనేది అసాధ్యం అని భారతీయ జనతా పార్టీ అధిష్టానానికి ఆంధ్రప్రదేశ్ నాయకులు స్పష్టం చేసినట్లు సమాచారం.

గడచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు కారణంగా కొన్ని స్థానాలలో విజయం సాధించామని, ఈసారి ఆ పార్టీతో వైరం కారణంగా విజయం దక్కదేమోననే భయం వెంటాడుతోంది. ఈ విషయాన్ని పార్టీ అధినాయకత్వానికి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నాయకులు స్పష్టం చేసినట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్ లో లోక్ సభ లో గానీ శాసనసభ స్థానాల్లో గాని భారతీయ జనతా పార్టీకి తగినంత బలం లేదని, ఈ సమయంలో పోటీచేసి అవమానం పాలు కావడం మంచిది కాదని పార్టీ అధిష్ఠానానికి స్పష్టం చేసినట్లు సమాచారం.

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, విశాఖపట్నంలోని కొన్ని ప్రాంతాలలో మాత్రమే భారతీయ జనతా పార్టీకి అంతో ఇంతో ఓట్ బ్యాంక్ ఉందని, మిగిలిన చోట్ల తమను పట్టించుకునే వారే లేరని ఆంధ్రప్రదేశ్ బిజెపి నాయకులు చెబుతున్నారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంలో విఫలమయ్యామనే ఆగ్రహం ఏపీ ప్రజల్లో తీవ్రంగా ఉందని, ఇలాంటి సమయంలో ఓట్లు అడగడం దుస్సాహసమే అవుతుంది అని కమలనాధులు కంగారుపడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో పార్టీని అవమానం పాలు చేస్తున్న చంద్రబాబు నాయుడిని దెబ్బ కొట్టాలంటే బిజెపి ఓట్ బ్యాంక్ మరో పార్టీ వైపు మళ్లించాలని ఏపీ కమలనాధులు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయాన్ని ఇటీవల రాజమండ్రి వచ్చిన పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ముందు కూడా స్పష్టం చేసినట్లు సమాచారం.

Tags:    
Advertisement

Similar News