రఘురామకృష్ణంరాజూ పక్క చూపులు....
ఎన్నికల సమీపిస్తుండడంతో నేతల జంపింగ్‌లు ఊపందుకున్నాయి. గెలిచే అవకాశం, టికెట్ ఖారారు ఆధారంగానే నేతలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు నేతలు పార్టీలు మారగా… ఇప్పుడు నర్సాపురం పార్లమెంట్ టీడీపీ ఇన్‌చార్జ్ రఘురామకృష్ణంరాజు పేరు కూడా ఆ జాబితాలో చేరడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే రఘురామకృష్ణంరాజు వైసీపీలో చేరి ఆతర్వాత బీజేపీకి వెళ్లి అటు నుంచి టీడీపీలో చేరి ప్రస్తుతం నర్సాపురం టీడీపీ పార్టీ లోక్‌సభ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. కేవీపీకి వియ్యంకుడు కూడా అయిన ఈయన… నర్సాపురం నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. కానీ చంద్రబాబు ఇప్పటికీ టికెట్ ఖాయం చేయలేదు. […]
ఎన్నికల సమీపిస్తుండడంతో నేతల జంపింగ్‌లు ఊపందుకున్నాయి. గెలిచే అవకాశం, టికెట్ ఖారారు ఆధారంగానే నేతలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు నేతలు పార్టీలు మారగా… ఇప్పుడు నర్సాపురం పార్లమెంట్ టీడీపీ ఇన్‌చార్జ్ రఘురామకృష్ణంరాజు పేరు కూడా ఆ జాబితాలో చేరడం చర్చనీయాంశమైంది.
ఇప్పటికే రఘురామకృష్ణంరాజు వైసీపీలో చేరి ఆతర్వాత బీజేపీకి వెళ్లి అటు నుంచి టీడీపీలో చేరి ప్రస్తుతం నర్సాపురం టీడీపీ పార్టీ లోక్‌సభ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు.
కేవీపీకి వియ్యంకుడు కూడా అయిన ఈయన… నర్సాపురం నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. కానీ చంద్రబాబు ఇప్పటికీ టికెట్ ఖాయం చేయలేదు. ఎన్నికలు దగ్గరపడుతుండడంతో టికెట్ ఆఖరి నిమిషంలో ఎగ్గొడితే పరిస్థితి ఏంటన్నది రఘురామకృష్ణంరాజు వర్గం ఆందోళన. దాంతో ఆయన పార్టీ మారేందుకు కూడా సిద్దమవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది.
పార్టీలో చేరే ముందే టికెట్ ఖాయమని చెప్పిన చంద్రబాబు ఇప్పటికీ ఎందుకు పేరు ప్రకటించడం లేదన్నది రఘురామకృష్ణంరాజు అనుమానం.
రఘురామకృష్ణంరాజు పార్టీ మారే ఆలోచనతో కూడా ఉన్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. అయితే
ప్రస్తుతానికి ఈ ప్రచారాన్ని రఘురామకృష్ణంరాజు ఖండిస్తున్నారు. చూడాలి ఏం జరుగుతుందో.