నేత టీడీపీలోకి.... అయినా క్యాడర్ వెళ్లట్లేదు!

కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి చేరడం ఖరారు అయ్యింది. కోట్లకు చంద్రబాబు నాయుడు కర్నూలు ఎంపీ టికెట్ కేటాయిస్తూ ఉన్నారట. ఆయన భార్యకు ఆలూరు నుంచి అసెంబ్లీ టికెట్ ఖరారు అయ్యిందని సమాచారం. ఇవిగాక.. కోట్ల కుమారుడికి ఎమ్మెల్సీగా కూడా అవకాశం ఇస్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు ప్రకటించారట. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కోట్ల తెలుగుదేశంలోకి చేరడం ఖరారు అయినట్టుగా ఉంది. తెలుగుదేశం పార్టీలోకి చేరడం విషయంలో మొదట ఉత్సాహం చూపించిన […]

Advertisement
Update:2019-02-23 06:00 IST

కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి చేరడం ఖరారు అయ్యింది. కోట్లకు చంద్రబాబు నాయుడు కర్నూలు ఎంపీ టికెట్ కేటాయిస్తూ ఉన్నారట. ఆయన భార్యకు ఆలూరు నుంచి అసెంబ్లీ టికెట్ ఖరారు అయ్యిందని సమాచారం. ఇవిగాక.. కోట్ల కుమారుడికి ఎమ్మెల్సీగా కూడా అవకాశం ఇస్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు ప్రకటించారట. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కోట్ల తెలుగుదేశంలోకి చేరడం ఖరారు అయినట్టుగా ఉంది.

తెలుగుదేశం పార్టీలోకి చేరడం విషయంలో మొదట ఉత్సాహం చూపించిన కోట్ల ఆ తర్వాత కొంత ఆలోచనలో పడ్డాడు. చివరకు ఇప్పుడు ఆ పార్టీలోకి చేరడానికే ఆయన రెడీ అయ్యారట. ఇంత వరకూ బాగానే ఉంది. కోట్ల తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారు కానీ.. ఆయన తో పాటు అనుచరగణం తెలుగుదేశం పార్టీలోకి చేరుతుందా.. అనేది మాత్రం అనుమానాస్పదంగా మారింది.

కోట్ల తెలుగుదేశం పార్టీలో చేరిక గురించి ఆయన కుటుంబంలోనే సపోర్ట్ లేకుండా పోయింది. ఆయన సోదరుడు… ఈ చేరికను వ్యతిరేకిస్తూ ఉన్నాడు. తెలుగుదేశం పార్టీలోకి చేరడానికి ఆయన ఇష్టపడలేదు. అందుకే ఇప్పటికే కోట్ల హర్షవర్ధన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోయాడు. ఇదీ పరిస్థితి. కోట్ల వెంట ఆయన తమ్ముడే నడవలేదు.

కాంగ్రెస్ పార్టీ చేతిలో అధికారం లేకపోయినా.. అలాంటి కాంగ్రెస్ లోనే కోట్ల ఉండినా.. చాలా మంది ఆయన వెంట నిలిచారు. అనుచరగణం ఆయనతో పాటు నిలిచింది. అయితే కోట్ల సోలోగా నిలిచినంత సేపూ ఆయన వెంట నిలిచిన క్యాడర్.. ఆయన తెలుగుదేశం పార్టీలోకి చేరడాన్ని మాత్రం హర్షించలేకపోతున్నారు. వారు తెలుగుదేశం పార్టీలోకి చేరడం లేదు.

ఏదో నామమాత్రంగా మినహాయిస్తే.. కోట్ల ప్రధాన అనుచరులంతా తెలుగుదేశంలోకి వెళ్లడం లేదు. తెలుగుదేశం పార్టీతో దశాబ్దాల రాజకీయ వైరాన్ని మరిచిపోలేమని వారు అంటున్నారట.

Tags:    
Advertisement

Similar News